Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అస్సలు ఊహించలేదు.. మా ఓటమికి కారణం అదే: టెంబా బవుమా

Temba Bavuma says As a batting unit we failed to apply ourselves in those conditions

తిరువనంతపురం: చెత్త బ్యాటింగ్‌, పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోవడమే భారత్‌తో తమ ఓటమికి ప్రధాన కారణాలని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంలో తమ బ్యాటింగ్ విభాగం విఫలమైందన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సఫారీ కెప్టెన్ టెంబా బవుమా తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

'పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో మా బ్యాటింగ్ యూనిట్ విఫలమైంది. పిచ్ ఇలా ఉంటుందని మేం అస్సలు ఊహించలేదు. మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటుందని మేం భావించాం. కానీ పిచ్ నుంచి పేసర్లకు అడ్వాంటేజ్ లభించింది. మా పేసర్లు విజయం కోసం తమ వంతు ప్రయత్నించినప్పటికి వారి దగ్గర సరిపోని పరుగులు లేవు. స్పిన్నర్లు కూడా బాగానే పోరాడారు. రెండో అర్దభాగంలో బ్యాటింగ్ పరంగా అద్భుత ప్రదర్శన కనబర్చడమే ఈ మ్యాచ్‌లో మా జట్టుకు లభించిన సానుకూలాంశం'అని బవుమా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. కనీసం 50 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఎయిడెన్ మార్క్‌రమ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25), వేన్ పార్నెల్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24), కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పోరాడి గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు 70 డాట్ బాల్స్ వేయడం గమనార్హం. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/24), హర్షల్ పటేల్(2/26) రెండేసి వికెట్లు తీసారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, September 28, 2022, 22:58 [IST]
Other articles published on Sep 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+