
చెత్త బౌలింగ్..
'ఇది ఏ మాత్రం మా స్థాయికి తగ్గ బౌలింగ్ ప్రదర్శన కాదు. విభిన్న పరిస్థితులకు తగ్గట్లు భిన్నమైన ప్రణాళికలు అవసరం. కానీ మేం ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయాం. బ్యాటింగ్ పరంగా 220 పరుగుల లక్ష్యం అయితే చేధించడానికి సులువయ్యేది. కానీ 240 చాలా ఎక్కువ. మేం 20 పరుగులు అదనంగా ఇచ్చి మూల్యం చెల్లించుకున్నాం.
డేవిడ్ మిల్లర్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎందుకో మరోసారి తెలియజేశాడు. అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేశాడు. ఇక భారత బౌలర్లు అద్భుతంగా స్వింగ్ చేయగలరు. ఆరంభంలో పిచ్ నుంచి లభించిన సహకారంతో బంతి స్వింగ్ చేస్తూ వికెట్లు రాబడుతున్నారు. ఇక స్వింగ్ ఆగిపోయిన తర్వాత వికెట్ బ్యాటింగ్ చాలా సులువు అవుతుంది.'అని బవుమా చెప్పుకొచ్చాడు.

చెలరేగిన సూరీడు..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పోటీపడి మరీ పరుగిలిచ్చారు.

భయపెట్టిన మిల్లర్, డికాక్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్‌కు విజయానందమే లేకుండా చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసినా... 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దీపక్ చాహర్(0/24) మినహా అంతా ధారళంగా పరుగులిచ్చారు. మూడో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications












