Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PKL 2025: ఎలిమినేటర్‌లో ఘన విజయం..ఫైనల్‌కు అడుగుదూరంలో తెలుగు టైటాన్స్!

ప్రొకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 2025 సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతోంది. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్-3 మ్యాచ్‌లోనూ తెలగు టైటాన్స్ 46-39 తేడాతో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఆల్‌రౌండర్ భరత్(23) దుమ్మురేపగా.. కెప్టెన్ విజయ్ మాలిక్(5) అతనికి అండగా నిలిచాడు. పట్నా పైరేట్స్‌లో అయాన్(22) రాణించినా ఫలితం లేకపోయింది.

మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ దుమ్మురేపింది. ఫస్టాఫ్ నుంచే దూకుడుగా ఆడిన తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్‌ను ఒకసారి ఆలౌట్ చేసింది. పట్నా కూడా ధీటుగా బదులిచ్చింది. దాంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 22-20 తేడాతో రెండు పాయింట్స్ ఆధిక్యం సాధించింది. సెకండాఫ్‌లో భరత్ సత్తా చాటడంతో తెలుగు టైటాన్స్ దూసుకెళ్లింది.

Telugu Titans Defeat Patna Pirates 46-39 to Enter Qualifier 2 in Pro Kabaddi League
Photo Credit: PKL

ప్రత్యర్థిని మరోసారి ఆలౌట్ చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. ఆఖరి రైడ్‌లో భరత్ హుడా 3 పాయింట్స్ సాధించి విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గెలుపుతో తెలుగు టైటాన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ చేరుతుంది. అదే జరిగితే శుక్రవారం జరిగే ఫైనల్లో దబాంగ్ ఢిల్లీతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే 12 సీజన్లుగా నిరీక్షిస్తున్న టైటిల్ తెలుగు టైటాన్స్ కైవసం అవుతుంది.

Story first published: Tuesday, October 28, 2025, 21:44 [IST]
Other articles published on Oct 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+