హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లోకి మరో తెలుగోడు అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్ గడ్డపై ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20తో హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై ఈ తెలుగోడు తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ.. తిలక్ వర్మ తన బిగ్ హిట్టింగ్‌తో అందరీ దృష్టిని ఆకర్షించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నానే బెరుకు లేకుండా చెలరేగాడు. ఫియర్‌లెస్ గేమ్‌తో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు.
ప్రస్తుతం ఈ సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'ఏం గుండెరా అది... ఎదుర్కొన్న రెండో బంతే సిక్సరా?'అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఓవరాల్‌గా 22 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా విజయం సాధించలేకపోయింది. ఊహించని రీతితో 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(41), రోవ్‌మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.