Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Varma: అరంగేట్రంలోనే సెంచరీ బాదిన తెలుగోడు!

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సెంచరీతో చెలరేగాడు. హాంప్‌షైర్‌ తరఫున కౌంటీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. ఎస్సెక్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే శతకాన్ని అందుకున్నాడు. 239 బంతుల్లో మూడెంకల స్కోర్ అందుకొని కెరీర్‌లో ఆరో ఫస్ట్ క్లాస్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ పూర్తయిన వెంటనే సిమన్ హార్మర్‌ బౌలింగ్‌లో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ దూకుడుగా కాకుండా అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. చాలా ఓపికగా ఆడాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే హ్యాట్రిక్ బాల్ ఫేజ్ చేసిన తిలక్ వర్మ.. కండిషన్స్ గౌరవిస్తూ ఆచితూచి ఆడాడు.

మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన తిలక్ వర్మ.. నాలుగో వికెట్‌కు 68, ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. తిలక్ సూపర్ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్ భారీ స్కోర్ స్కోర్ దిశగా సాగుతోంది. ఇప్పటికే 393 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ 296 పరుగులు చేసింది. భారత్ తరఫున ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన తిలక్ వర్మ.. టెస్ట్ ఫార్మాట్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Telugu Player Tilak Varma Hits Century on Hampshire Debut

భారత్ తరఫున 4 వన్డేలతో పాటు 25 టీ20‌లు ఆడిన తిలక్.. ఇప్పటి వరకు 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్ తన ఫేవరేట్ ఫార్మాట్ అని తిలక్ వర్మ తెలిపాడు. సెంచరీ అనంతరం హాంప్‌షైర్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడాడు. టెస్ట్ క్రికెట్‌లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. 'టీ20ల్లో మూడో ర్యాంక్ సాధించడంతో అందరూ నేను టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అనుకుంటున్నారు. కానీ నేను మంచి టెస్ట్ బ్యాటర్‌ని. ఈ విషయాన్ని చాలా రోజులుగా చెబుతున్నా. శరీరానికి దగ్గరగా ఆడటం నాకు చాలా ఇష్టం. ఇలా ఆడటం సవాల్‌గా ఉంటుంది.'అని తిలక్ వర్మ తెలిపాడు. హాంప్‌షైర్ తరఫున అతను నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాడు.

Story first published: Tuesday, June 24, 2025, 17:31 [IST]
Other articles published on Jun 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+