Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ప్రపంచకప్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా తిరుగుతా!

World Cup 2023: సంచలన ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. విజేతగా నిలిస్తే బట్టలు లేకుండా వైజాగ్ బీచ్‌లో తిరుగుతానని టాలీవుడ్ హీరోయిన్ రేఖ భోజ్ ప్రకటించింది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ విజయానందంలో రేఖ భోజ్.. సోషల్ మీడియా వేదికగా ఈ నగ్న ప్రకటన చేసింది. 'భారత్ ప్రపంచకప్ గెలిస్తే.. నేను వైజాగ్ బీచ్‌లో బట్టలు లేకుండా తిరుగుతా'అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని, అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలా పోస్ట్ పెట్టిందని మండిపడుతున్నారు.

 Telugu Actress Rekha Boj says To Run Naked On Vizag Beach If India Wins World Cup

ఇంకొందరు అయితే ఇప్పుడే వైజాగ్‌కు టికెట్ బుక్ చేస్తున్నా.. నగ్నంగా తిరిగేందుకు రెడీగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. నగ్నంగా తిరుగుతా అంటున్నా రేఖ బోజ్‌పై పీడీ యాక్ట్ కేసు పెట్టండి జగన్ గారూ.. అని మరికొందరు సూచిస్తున్నారు. రేఖ బోజ్.. మరో పూనమ్ పాండేనని లైట్ తీసుకుంటున్నారు.

రేఖ బోజ్.. దామినీ విల్లా, మాంగళ్య, కాత్యాయని సినిమాల్లో నటించింది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 105) శతకాలతో రాణించారు. శుభ్‌మన్ గిల్(66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 నాటౌట్), రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 134) సెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్(73 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, November 16, 2023, 16:55 [IST]
Other articles published on Nov 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+