చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ.. భారత్ ఘన విజయం!
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. సూపర్ సిక్స్‌లో భాగంగా స్కాంట్లాండ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష(59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో శతక్కొట్టిన త్రిష.. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. త్రిషతో పాటు మరో ఓపెనర్ కమలిని(42 బంతుల్లో 9 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. సనికా చాల్కే(20 బంతుల్లో 5 ఫోర్లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించింది.

అనంతరం స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు పిప్పా(12), వాల్‌సింగమ్(12), పిప్పా స్ప్రౌల్(11) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో శుక్ల 4 వికెట్లు తీయగా.. వైష్ణవి శర్మ, త్రిష తలో మూడు వికెట్లు తీసారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ సెమీఫైనల్ చేరింది. జనవరి 31న సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లోనే త్రిష సెంచరీ సాధించింది. దాంతో అండర్ 19 టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించింది. త్రిష శతకంతో టీమిండియా 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. అండర్ 19 టీ20ల్లోనే ఇది రికార్డ్ స్కోర్. మరో ఓపెనర్ కమలినితో కలిసి త్రిష తొలి వికెట్‌కు 147 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications