For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం!

మహిళల అండర్ 19 ప్రపంచకప్‌ 2025 విజేత, తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష‌కు అరుదైన గౌరవం దక్కింది. మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. భారత విజయంలో గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. సంచలన బ్యాటింగ్‌తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్లోనూ గొంగడి త్రిష(33 బంతుల్లో 8 ఫోర్లతో 44 నాటౌట్) అదరగొట్టింది. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసింది.

అయితే ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ.. టోర్నీ ఆఫ్ ది టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గొంగడి త్రిషతో పాటు నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. త్రిషతో పాటు జి కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ టోర్నీలో 11 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకేను సారథిగా ఎంపిక చేసింది.

Telangana s Gongadi Trisha among four Indians named in team of ICC Women s Under-19 T20 World Cup

ఈ టోర్నీలో గొంగడి త్రిష 77.25 సగటుతో 309 పరుగులు చేసింది. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉంది. టోర్నీ టాపర్‌గా నిలవడమే కాకుండా.. బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. మరో భారత ప్లేయర్ జి కమలిని 35.75 సగటుతో 143 పరుగులు చేసింది. ఆయుషి శుక్లా 14 వికెట్లు తీయగా.. వైష్ణవి శర్మ 17 వికెట్లు పడగొట్టాడు.

ఐసీసీ అండర్ 19 బెస్ట్ టీమ్:
గొంగడి త్రిష, జెమ్మా బోథా, డేవినా పెర్రిన్, జి కమలిని, కావోయిమ్‌హే బ్రే, పూజ మహతో, కైలా రేనెకే, కేటీ జోన్స్, ఆయుషి శుక్లా, చమోడి ప్రబోద, వైష్ణ విశర్మ, న్తాబిసెంగ్ నిని

Story first published: Monday, February 3, 2025, 16:58 [IST]
Other articles published on Feb 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+