Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ప్చ్.. మళ్లీ విఫలమైన వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 21 పరుగులే చేసి వెనుదిరిగాడు. 150 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఈ ముక్కోణపు సిరీస్‌లో వైభశ్ సూర్యవంశీ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాటింగ్ చేయలేదు. శ్రీలంక-ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 పరుగులే చేసిన వైభవ్.. అఫ్గాన్-ఏతో జరిగిన రెండో మ్యాచ్‌లో 44 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు పారేసుకుంటున్నాడు.

Teenage Sensation Vaibhav Sooryavanshi Fails to Convert Again vs Sri Lanka A Match in Tri Series

ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ వేదికపై ఇలా వరుసగా విఫలమవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ రాణించకపోతే.. అతని అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ వైఫల్యం భారత్-ఏ విజయవకాశాలను కూడా ప్రభావితం చేస్తోంది. శ్రీలంక-ఏతో గత మ్యాచ్‌లో గెలిచిన భారత్.. అఫ్గాన్-ఏ చేతిలో ఓటమిపాలైంది. తాజా మ్యాచ్‌లో ఓడితే ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారనున్నాయి.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం!

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల అవార్డులను గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. కానీ భారత్-ఏ తరఫున వరుసగా విఫలమవుతుండటంతో అతనికిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ వెనకడుగు వేయవచ్చని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

శ్రీలంక-ఏతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఏ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. వైభవ్‌తో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(11) కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు తిలక్ వర్మ ఉన్నారు.ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.

ఇదేం ఫ్యామిలీరా అయ్యా.. 10 ఏళ్లకే సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడూ!

ఇదేం ఫ్యామిలీరా అయ్యా.. 10 ఏళ్లకే సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడూ!
Story first published: Monday, June 15, 2026, 11:11 [IST]
Other articles published on Jun 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+