Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 విజేతగా ఆర్‌సీబీ.. కన్నీటి పర్యంతమైన విరాట్ కోహ్లీ!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. తొలి టైటిల్‌ను ముద్దాడింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు. జోష్ హజెల్ వుడ్ ఆఖరి ఓవర్ పూర్తవ్వకముందే.. ఆర్‌సీబీ విజయం లాంఛనమవ్వగా.. కోహ్లీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఆర్‌సీబీ విజయం ఖాయం కాగానే.. నేల కూలిన విరాట్.. కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

18 ఏళ్లుగా ఆర్‌సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. మూడు ఫైనల్స్(2009, 2011, 2016) తర్వాత తన కలను సాకారం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

Tears of Joy Virat Kohli Gets Emotional After RCB s Maiden IPL 2025 Title Win

అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు. శ్రేయస్ అయ్యర్(1) వైఫల్యం ఆర్‌సీబీకి కలిసొచ్చింది.

Story first published: Wednesday, June 4, 2025, 0:02 [IST]
Other articles published on Jun 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+