ఈ విజయంతో మా జట్టులో చాలా మంది ఏడ్చారు: వరుణ్ చక్రవర్తీ
ఐపీఎల్ 2024 సీజన్‌లో విజేతగా నిలిచినప్పుడు కూడా చూడని క్షణాలను రాజస్థాన్ రాయల్స్‌తో విజయానంతరం చూశానని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ తెలిపాడు. తాజా విజయంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతీ ఆటగాడు కన్నీళ్లు పెట్టుకున్నాడని వెల్లడించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదు పరాజయాల తర్వాత కేకేఆర్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎట్టకేలకు ఫామ్ అందుకున్న వరుణ్ చక్రవర్తీ మూడు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
టైటిల్ గెలిచినప్పుడు కూడా ఏడ్వలేదు..
ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్ చక్రవర్తీ.. ఈ విజయం తమకు సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. 'ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా సంతోషంగా ఉంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా కన్నీళ్లను చూశా. పదేళ్ల తర్వాత 2024లో ఛాంపియన్‌గా నిలిచినప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలను నేను చూడలేదు.
ఈ గెలుపు క్రెడిట్ మా సపోర్ట్ స్టాఫ్‌దే. వరుస పరాజయాలతో మాపై వచ్చిన కామెంట్లు, విమర్శలను మావద్దకు రాకుండా వారు అన్ని చర్యలు తీసుకున్నారు. చాలా మంది అనవసర నిందారోపణలు చేశారు. ఇలాంటప్పుడు టీమ్‌మేనేజ్‌మెంట్ మద్దతు అవసరం. ఈ విషయంలో కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు.

గాయాలతోనే..
గాయాల బెడదనే మా ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. అభిషేక్ నాయర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ నిరంతరం మమ్మల్ని ప్రోత్సహించింది. ఇప్పుడు విజయంతో మా ప్రయాణం మొదలైంది. ఇక మున్ముందూ ఇదే కొనసాగుతుంది.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్ ప్రారంభానికి ముందే హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ గాయాలతో లీగ్‌కు దూరమయ్యారు. మతిషా పతిరన జట్టులో చేరినా ఇంకా ఒక్క మ్యాచ్ ఆడలేదు. వరుణ్ చక్రవర్తీ కూడా గాయం నుంచి కోలుకున్నాడు. కామెరూన్ గ్రీన్ పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా రాణించడం లేదు. ఫిట్‌నెస్ సమస్యల వల్ల అతను ఆలస్యంగా బౌలింగ్ చేశాడు. రింకూ సింగ్ పేలవ ఫామ్ కూడా కేకేఆర్‌పై ప్రభావం చూపింది.
గెలిపించిన రింకూ సింగ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వి జైస్వాల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగీ(3/22), వరుణ్ చక్రవర్తీ(3/14) మూడేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం కేకేఆర్ 19.4 ఓవర్లలో 161 పరుగులు చేసి గెలుపొందింది. రింకూ సింగ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనుకుల్ రాయ్(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కామెరూన్ గ్రీన్(13 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27), రోవ్‌మన్ పోవెల్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా(2/8) రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవి బిష్ణోయ్ యశ్ రాజ్ పుంజా తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications