CWC 2023: వర్త్ శర్మా.. వర్త్! ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో విన్నర్!
IND vs NZ, CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా సమష్టి ప్రదర్శనతో విజయాలందుకోవడం విశేషం.
ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా ప్రతీ ఒక్కరు విజయంలో తమ వంతు కృషి చేయడం టీమిండియా సమష్టిప్రదర్శనలకు నిదర్శనం. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఐదుగురు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మ్యాచ్ విన్నర్‌గా నిలిస్తే.. అఫ్గానిస్థాన్‌తో రోహిత్ శర్మ.. పాకిస్థాన్‌తో జస్‌ప్రీత్ బుమ్రా.. బంగ్లాదేశ్‌తో విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్‌తో మహమ్మద్ షమీలు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు.

'టీమ్ వర్క్స్ మేక్స్ ద డ్రీమ్ వర్క్'అనే నినాదాన్ని గుర్తు చేస్తూ రోహిత్ సేన ప్రపంచకప్‌లో దూసుకెళ్తోంది. టీమిండియా సమష్టి ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదే జోరును ఫైనల్ వరకు కొనసాగించి 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా సరికొత్తగా కనిపిస్తోందని, జట్టు ఉత్సాహం చూస్తుంటే ప్రపంచకప్ మనదేననే ధీమా కలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని, టీమ్ ప్రణాళికలు కూడా బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుందని, ఆటగాళ్ల మధ్య పోటీ తత్వం పెంచడం.. ఒకరి ఘనతను మరొకరు ఆస్వాదించేలా చేయడంలో టీమిండియా మేనేజ్‌మెంట్ సక్సెస్ అయ్యింది. కొందరైతే.. రోహిత్ శర్మ కెప్టెన్సీని కొనియాడుతూ.. వర్త్ శర్మా వర్త్ అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
బెంచ్ ఆటగాళ్లు కూడా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడం అద్భుతమని మహమ్మద్ షమీని ఉద్దేశించి ప్రశంసిస్తున్నారు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన షమీ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడుతున్నారు. (5/54) ఐదు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించి... 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఆ జట్టు విజయాన్ని అందించాడని కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిదా అయ్యారు. అద్భుత విజయమని టీమ్‌ను అభినందించారు. టీమ్ వర్క్‌కు ఈ విజయం నిదర్శనమని ఎక్స్‌వేదికగా కొనియాడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications