For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం టీమిండియా షెడ్యూల్ ఏంటంటే?

టీమిండియా ఇంగ్లండ్ పర్యటన తుది దశకు చేరింది. మరో రెండు రోజుల్లో ఈ సుదీర్ఘ పర్యటన ముగియనుంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ షెడ్యూల్ ప్రకారం సోమవారం ముగియాల్సి ఉంది. కానీ మ్యాచ్ పరిస్థితి చూస్తుంటే ఆదివారమే ఫలితం తేలనుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో వెనుకంజలో నిలిచిన టీమిండియా సమం చేసేందుకు ఆఖరి టెస్ట్‌లో పోరాడుతోంది. ఆఖరి టెస్ట్‌ను టీమిండియా గెలిస్తే ఈ సిరీస్ 2-2తో సమమవుతుంది. ఓడితే మాత్రం సిరీస్ ఇంగ్లండ్ 3-1తో కైవసం చేసుకుంటుంది. డ్రా అయినా ఈ సిరీస్ ఇంగ్లండ్‌కే దక్కుతుంది.

అయితే ఈ సిరీస్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు సుమారు 35 రోజుల విశ్రాంతి లభించనుంది. వాస్తవానికి ఈ సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగాలేకపోవడంతో ఈ పర్యటనను వాయిదా వేసారు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారంతో ఈ పర్యటనను 2026 సెప్టెంబర్‌కు వాయిదా వేసుకున్నాయి. దాంతో ఆసియాకప్ 2025 వరకు టీమిండియాకు ఎలాంటి సిరీస్‌లు లేకుండా పోయాయి. ఈ ఖాళీ సమయంలో శ్రీలంకతో సిరీస్‌లు ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినా.. అదంతా ఉట్టిదేనని తేలింది.

Team India s Post-England Test Series Schedule Players Get 35-Day Break

ఆసియా కప్‌ 2025తో రీఎంట్రీ..

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు టీ20 ఫార్మాట్‌లో యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరగనుంది. సెప్టెంబర్ 9న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్.. ఈ టోర్నీని మొదలు పెట్టనుంది. గ్రూప్-ఏలో ఓమన్, పాకిస్థాన్, యూఏఈతో ఉన్న భారత్.. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 19న ఓమన్‌తో తలపడనుంది. సూపర్-4కు అర్హత సాధిస్తే..మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఫైనల్ చేరితే తుది పోరు బరిలోకి దిగనుంది.


వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌లు..

సొంతగడ్డపై అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2-6 తొలి టెస్ట్, అక్టోబర్ 10-14 మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం సౌతాఫ్రికా భారత పర్యటనకు రానుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు రెండు టెస్ట్‌ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనతో ఈ ఏడాదికి సంబంధించిన టీమిండియా షెడ్యూల్ ముగియనుంది. టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.

టీమిండియా షెడ్యూల్:

1. ఆసియా కప్ (సెప్టెంబర్ 2025)

భారత మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 10: vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (రాత్రి 07:30 గంటలకు)
సెప్టెంబర్ 14: vs పాకిస్తాన్ (రాత్రి 07:30 గంటలకు)
సెప్టెంబర్ 19: vs ఒమన్ (రాత్రి 07:30 గంటలకు)

2. వెస్టిండీస్ రెండు టెస్ట్‌లు(అక్టోబర్ 2025)

మొదటి టెస్ట్: అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియం) - ఉదయం 09:30 గంటలకు.

రెండో టెస్ట్: అక్టోబర్ 10-14 (ఢిల్లీ, అరుణ్ జైట్లీ స్టేడియం) - ఉదయం 09:30 గంటలకు.

3. ఆస్ట్రేలియా పర్యటన (అక్టోబర్-నవంబర్ 2025)

వన్డేలు:

అక్టోబర్ 19: పర్త్ స్టేడియం (ఉదయం 09:00 గంటలకు)
అక్టోబర్ 23: అడిలైడ్ ఓవల్ (ఉదయం 09:00 గంటలకు)
అక్టోబర్ 25: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఉదయం 09:00 గంటలకు)

టీ20లు:

అక్టోబర్ 29: మనుక ఓవల్ (మధ్యాహ్నం 01:45 గంటలకు)
అక్టోబర్ 31: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (మధ్యాహ్నం 01:45 గంటలకు)
నవంబర్ 2: బెల్లెరివ్ ఓవల్ (మధ్యాహ్నం 01:45 గంటలకు)
నవంబర్ 6: కరారా స్టేడియం (మధ్యాహ్నం 01:45 గంటలకు)
నవంబర్ 8: ది గాబ్బా (మధ్యాహ్నం 01:45 గంటలకు)

4. సౌతాఫ్రికా vs భారత్ (నవంబర్-డిసెంబర్ 2025)

టెస్ట్‌లు:
నవంబర్ 14-18: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (ఉదయం 09:30 గంటలకు)
నవంబర్ 22-26: బార్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి (ఉదయం 09:30 గంటలకు)

వన్డేలు:

నవంబర్ 30: జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ (మధ్యాహ్నం 01:30 గంటలకు)
డిసెంబర్ 3: షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్ (మధ్యాహ్నం 01:30 గంటలకు)
డిసెంబర్ 6: డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం (మధ్యాహ్నం 01:30 గంటలకు)

టీ20లు:

డిసెంబర్ 9: బారాబతి స్టేడియం, కటక్ (రాత్రి 07:00 గంటలకు)
డిసెంబర్ 11: మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్ (రాత్రి 07:00 గంటలకు)
డిసెంబర్ 14: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల (రాత్రి 07:00 గంటలకు)
డిసెంబర్ 17: భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో (రాత్రి 07:00 గంటలకు)
డిసెంబర్ 19: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ (రాత్రి 07:00 గంటలకు)

Story first published: Saturday, August 2, 2025, 19:16 [IST]
Other articles published on Aug 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+