Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫస్ట్‌టైమ్ భారత్-ఎతో కోహ్లీసేన టెస్ట్ మ్యాచ్!

 Team India To Clash With India A In England Before Test Series

లండన్‌: భారత క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు సిరీస్‌కు ముందు ఆ దేశ 'ఎ' టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడడం ఆనవాయితీ. అయితే తొలిసారి ఇండియా టీమ్ వామప్ మ్యాచ్‌లో ఇండియా-ఏతోనే తలపడనుంది. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన‌కు వెళ్లనున్న కోహ్లీసేన టెస్ట్ సిరీస్‌కు ముందు అక్కడ ఇండియా-ఎ టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

ఈసారి భారత జట్టుతో పాటు ఇండియా-ఎ టీమ్ కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. దాంతో రెండు జట్ల మధ్య జూలై చివరి వారంలో నార్త్ హాంప్‌షైర్‌లో నాలుగు రోజుల వామప్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని నార్త్ హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ధృవీకరంచింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే టూర్‌లో టీమిండియా.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌లు ఆడనుంది. అందులో మొదటి టెస్ట్.. ఆగస్టు 4న నాటింగ్ హోమ్‌లో జరగనుంది. సిరీస్‌కు ముందు భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలని డిసైడైంది. ఫస్ట్ మ్యాచ్ భారత్-ఎతో ఖాయం కాగా.. లీస్టర్ షైర్‌లో సెకండ్ వామప్‌ను షెడ్యూల్ చేశారు.

'ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా నాలుగు రోజుల సన్నాహక టెస్టులో భారత్‌-ఎతో తలపడనుంది. జులై 28న రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం భారత బృందం అక్కడి నుంచి లీసెస్టర్‌షైర్‌కు చేరుకుంటుంది' అని కౌంటీ క్లబ్‌ పేర్కొంది.

నాటింగ్‌హామ్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఆగస్టు 4-8 వరకు తొలి టెస్టు జరగనుంది. ఇక రెండు (ఆగస్టు 12-16), నాలుగో టెస్టు (సెప్టెంబర్‌ 2-6)లకు వేదిక లండన్‌. మూడో (ఆగస్టు 25-29) టెస్టు లీడ్స్‌, ఐదో టెస్టు (సెప్టెంబర్‌ 10-14)కు మాంచెస్టర్లో జరుగుతాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌.. భారత్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్ తలపడనుంది. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Friday, January 29, 2021, 11:43 [IST]
Other articles published on Jan 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+