IND vs ENG మూడో వన్డేలో భారత్ గెలవాలంటే ఈ మూడు మార్పులు చేయాల్సిందే!

హైదరాబాద్: ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్ విజయంతో జోరు కనబర్చిన టీమిండియాకు రెండో వన్డేలో ఊహించని షాక్ తగిలింది. తొలి వన్డేలో భారీ విజయం నమోదు చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో ఆ జోరు కనబర్చలేకపోయింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. అయితే రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన భారత్.. మూడో మ్యాచ్‌లో విజయం సాధించాలంటే వ్యూహాత్మకంగా మూడు మార్పులు చేయాలి. అప్పుడే అనుకున్న ఫలితం రోహిత్ సేన వశం కానుంది.

ప్రసిధ్ స్థానంలో శార్దూల్..
రెండో వన్డేలో దారుణంగా విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వేటు వేసి శార్దూల్ ఠాకూర్ జట్టులోకి తీసుకోవాలి. రెండు వన్డేల్లో మూడో పేసర్‌గా జట్టులోకి వచ్చిన ప్రసిధ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో ఒక్కో వికెట్ మాత్రమే తీసాడు. అంతేకాకుండా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. తొలి వన్డేలో 5 ఓవర్లలో 26 పరుగులిచ్చిన ప్రసిధ్.. రెండో వన్డేలో 53 పరుగులిచ్చి భారత్ ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలోనే టచ్‌లో లేని ప్రసిధ్ స్థానంలో శార్దూల్‌ను ఆడించడం జట్టుకు మంచిది. అతని రాకతో టీమ్ బ్యాటింగ్ బలం కూడా పెరుగోతుంది. పైగా స్వింగ్ కండిషన్స్‌లో శార్దూల్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతని అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుంది.

హార్థిక్ పాండ్యా మరిన్నీ ఓవర్లు..
ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో ఇంకొన్ని ఓవర్లు వేయించాలి. నాలుగో సీమర్‌గా జట్టు బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటున్న అతను తొలి రెండు వన్డేల్లో బంతితో సత్తా చాటాడు. కట్టడిగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీసాడు. రెండు మ్యాచ్‌ల్లో 10 ఓవర్లు వేసిన అతను 50 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అది కూడా రెండో వన్డేలో జాసన్ రాయ్, లియామ్ లివింగ్‌స్టోన్‌లను ఔట్ చేశాడు. స్వింగ్‌ను అద్భుతంగా కంట్రోల్ చేస్తున్న హార్దిక్.. షార్ప్ బౌన్సర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మరిన్ని ఓవర్లు ఇస్తే టీమిండియాకు లాభం చేకూరనుంది.

సూర్యను ముందే ఆడించాలి..
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించాలి. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండో వన్డేలో అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు నష్టం చేసింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ధావన్ ఔటవ్వగానే పంత్ క్రీజులోకి వచ్చాడు. కానీ అతను దారుణంగా విఫలమవడంతో సూర్య తీవ్ర ఒత్తిడిలో స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. 27 పరుగులు చేసినప్పటికీ అతను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చుంటే క్రీజులో కుదురుకునే అవకాశం ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications