కొత్త ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే!
కాలగర్భంలో మరో ఏడాది గడిచిపోయింది. 2023 భారత క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని విజయాలను అందుకున్న టీమిండియా.. మెగాటోర్నీల్లో అదే జోరును కనబర్చింది. కానీ అసలు సమరంలో మాత్రం తడబడి టైటిళ్లను చేజార్చుకుంది.
జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్.. నవంబర్‌లో ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలోనే ఓడి తృటిలో రెండు ఐసీసీ టైటిల్స్ ను కోల్పోయింది.

ఈ రెండు పరాజయాలు మినహా ఏడాదంతా టీమిండియా దుమ్మురేపింది. మిశ్రమ ఫలితాలను మరిచి టీమిండియా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్దమైంది. కొత్త ఏడాదిలోనూ టీమిండియా ఫుల్‌బిజీగా ఉండనుంది. పుల్ ప్యాక్ క్రికెట్ షెడ్యూల్‌తో అభిమానులను అలరించనుంది. టీ20 ప్రపంచకప్ 2024తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా కీలక టెస్ట్‌లు ఆడనుంది.
ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలోనే ఉన్న టీమిండియా.. అక్కడే నూతన సంవత్సర సంబరాలు చేసుకోనుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌తో ఈ ఏడాది ఆటను ప్రారంభించనుంది. అనంతరం అఫ్గానిస్థాన్‌తో సొంతగడ్డపై 3 టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత డబ్ల్యూటీసీలో భాగంగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది.
అనంతరం రెండు నెలల పాటు ఐపీఎల్ జరగనుండగా.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీ అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
ఆ తర్వాత డబ్ల్యూటీసీలో భాగంగా బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై రెండు టెస్ట్‌ల సిరీస్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది. కొత్త ఏడాది చివర్లో ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది.
టీమిండియా 2024 పూర్తి షెడ్యూల్:
జనవరి: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ (విదేశీ)
జనవరి: సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్
జనవరి -మార్చి: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్
మార్చి-మే: ఐపీఎల్
జూన్: టీ20 ప్రపంచకప్ 2024(వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం)
జూలై: శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు
సెప్టెంబర్ 2024: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్
అక్టోబర్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్
నవంబర్-డిసెంబర్: ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్‌ల సిరీస్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications