ముగిసిన ఐపీఎల్ 2026.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఏంటంటే..?
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుసగా రెండో సారి టైటిల్ కైవసం చేసుకుంది. ఐపీఎల్ ముగిసిన 4 రోజుల వ్యవధిలోనే టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యారు.
జూన్ 6 నుంచి న్యూచంఢీఘర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, మహమ్మద్ సిరాజ్ ఈ ఏకైక టెస్ట్ ఆడనున్నారు. ఆ తర్వాత అదే జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 ప్రిపరేషన్స్ మొదలవ్వనున్నాయి. ఈ వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు.
శ్రీలంక పర్యటనకు తిలక్ సేన..
మరోవైపు భారత్-ఏ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌తో ట్రై సిరీస్ ఆడనుంది. జూన్ 9-21 వరకు ఈ ట్రై సిరీస్ జరగనుండగా.. వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ తరఫున బరిలోకి దిగనున్నాడు. జూన్ చివర్లో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ20లు మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగనుంది. జూలై 1 నుంచి 9 వరకుఈ సిరీస్‌లు జరగనున్నాయి.

ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా షెడ్యూల్..
1. అఫ్ఘనిస్తాన్ భారత పర్యటన 2026
ఐపీఎల్ తర్వాత భారత సీనియర్ జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
ఏకైక టెస్ట్ మ్యాచ్: జూన్ 6 నుండి 10 - న్యూ చండీగఢ్
1వ వన్డే: జూన్ 13 - ధర్మశాల
2వ వన్డే: జూన్ 17 - లక్నో
3వ వన్డే: జూన్ 20 - చెన్నై
2. శ్రీలంక ఏ-టీమ్ ట్రై సిరీస్
1వ మ్యాచ్ (శ్రీలంక ఎ vs ఇండియా ఎ): జూన్ 9 - దంబుల్లా
2వ మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్ ఎ vs ఇండియా ఎ): జూన్ 11 - దంబుల్లా
4వ మ్యాచ్ (శ్రీలంక ఎ vs ఇండియా ఎ): జూన్ 15 - దంబుల్లా
5వ మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్ ఎ vs ఇండియా ఎ): జూన్ 17 - దంబుల్లా
ఫైనల్ మ్యాచ్: జూన్ 21 - దంబుల్లా
3. ఇండియా ఐర్లాండ్ పర్యటన 2026
జూన్ చివరి వారంలో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
1వ టీ20: జూన్ 26 - బెల్‌ఫాస్ట్
2వ టీ20: జూన్ 28 - బెల్‌ఫాస్ట్
4. ఇండియా ఇంగ్లండ్ పర్యటన 2026
ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. అక్కడ 5 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
టీ20 సిరీస్ షెడ్యూల్:
1వ టీ20: జూలై 1 - చెస్టర్-లీ-స్ట్రీట్
2వ టీ20: జూలై 4 - మాంచెస్టర్
3వ టీ20: జూలై 7 - నాటింగ్‌హామ్
4వ టీ20: జూలై 9 - బ్రిస్టల్
5వ టీ20: జూలై 11 - సౌతాంప్టన్
వన్డే సిరీస్ షెడ్యూల్:
1వ వన్డే: జూలై 14 - బర్మింగ్‌హామ్
2వ వన్డే: జూలై 16 - కార్డిఫ్
3వ వన్డే: జూలై 19 - లార్డ్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

