Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2021లో టీమిండియా బిజీ.. బిజీ.. వర్క్ లోడ్ లేకుండా ఆటగాళ్ల రొటేషన్!

Team India Schedule 2021: Virat Kohli and team scheduled to play non-stop 12 months

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు పెద్దగా క్రికెట్‌ ఆడలేకపోయింది. న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు మినహా మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆలేదు. ప్రాణాంతక వైరస్ కారణంగా సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కూడా జరగలేదు. నెలలపాటు ఆటగాళ్లు లాక్‌డౌన్‌లో ఉండిపోగా కొన్ని సిరీస్‌లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కానీ 2021లో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉండబోతోంది.

కనీసం ఒక నెలపాటు కూడా క్రికెటర్లకు విశ్రాంతి లభించడం లేదు. కోహ్లీసేన జనవరి నుంచి మొదలుపెట్టి డిసెంబరు వరకు నిరవధికంగా సిరీస్‌ల మీద సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా ఈ సమయంలో భారత జట్టు 14 టెస్టులు, 16 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతుంది. జూన్‌లో ఆసియా టీ20, అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌ వీటికి అదనం. ఐపీఎల్‌తో కూడా ఆటగాళ్లు బిజీకానున్నారు.

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన సిరీస్‌లను సర్దుబాటు చేసే క్రమంలో ఇలా బిజీ క్రికెట్‌ ఆడాల్సి వస్తోంది. క్రికెటర్లపై పని ఒత్తిడి పడడం ఖాయమే అయినా రొటేషన్‌ పద్ధతిని అమలు చేస్తామని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అత్యుత్తమ క్రికెటర్లు అందుబాటులో ఉన్నందున ఎలాంటి ఆందోళనా అవసరం లేదని చెప్పాడు. అయితే బీసీసీఐ అధికారికంగా ఈ షెడ్యూల్‌ను ప్రకటించాల్సివుంది.

1. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీమిండియా 4 వన్డేలు, 4 టెస్ట్‌లు, 4 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లో జనవరి-మార్చి మధ్య జరగనున్నాయి.

2. ఏప్రిల్- మే మధ్య ఐపీఎల్ 2021 సీజన్ జరిగే అవకాశం ఉంది.

3. శ్రీలంక వేదికగా ఆ జట్టుతో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జూన్‌లో ఈ టూర్ ఉండే అవకాశం ఉంది.

4. జూన్ జూలై మధ్య టీ20 ఆసియాకప్ జరగనుంది. ఈ టోర్నీలో కోహ్లీ సేన 6 మ్యాచ్‌ల వరకు ఆడే అవకాశం ఉంది.

5. 3 వన్డేల కోసం జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది.

6. కరోనా కారణంగా ఆగిపోయిన సౌతాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ అక్టోబర్‌లో భారత్ వేదికగా జరగనుంది.

7. అక్టోబర్-నవంబర్ మధ్య భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.

8. నవంబరు-డిసెంబరు‌లో న్యూజిలాండ్‌ భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు జరగనున్నాయి.

9. డిసెంబర్‌లో కోహ్లీసేన సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో 3 టెస్ట్‌లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడనుంది.

Story first published: Wednesday, November 18, 2020, 8:06 [IST]
Other articles published on Nov 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+