IND vs ENG: ఐదో టెస్ట్ విషయంలో ఈసీబీ అతి తెలివి.. బీసీసీఐ ఆగ్రహం! షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్!

మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో ఇరు జట్ల మధ్య నేడు(శుక్రవారం) ప్రారంభంకావాల్సిన మ్యాచ్‌పై నీలనీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ కరోనా వ్యవహారం ఇరు జట్ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. కరోనా కలకలం నేపథ్యంలో ఆఖరి టెస్టును రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరగా.. వాకోవర్ ఇస్తే సిరీస్ ముగిద్దామని ఈసీబీ అతి తెలివి ప్రదర్శించింది. వాకోవర్ ఇవ్వడం వల్ల.. ఇప్పడు 2-1తో ఉన్న సిరీస్ కాస్తా 2-2గా మారి సమం అవుతుంది.

వాకోవర్ ఇవ్వాలంటూ..
ఈసీబీ మెలికపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీబీ చేసిన ప్రతిపాదన తమకు సమ్మతంగా లేదని తేల్చి చెప్పారు. గురువారం రాత్రి టీమిండియా క్రికెటర్లు అందరికీ చేసిన కోవిడ్ టెస్టు ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. దీంతో అందరినీ మాంచెస్టర్‌లోని రాడిసన్ హోటల్‌కు పరిమితం చేశారు. క్రికెటర్లు అందరినీ బయోబబుల్‌లోనే ఉంచారు. ఐదో టెస్టు షెడ్యూల్ ప్రకారమే ఆడుతామని బీసీసీఐ కూడా తేల్చి చెప్పడంతో ఈసీబీ వెనక్కు తగ్గింది. అయితే మ్యాచ్ ఆడకుండానే ఐదో టెస్టును తమ ఖాతాలో వేసుకుందామని అనుకున్న ఈసీబీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నష్టం భరించాలని..
'ఈసీబీ-బీసీసీఐ అధికారుల మధ్య జరిగిన సమావేశం చాలా ఆసక్తికరంగా ముగిసింది. కోవిడ్ నేపథ్యంలో ఐదో టెస్టును రద్దు చేయాలని.. దీని వల్ల ఐపీఎల్ 2021 రెండో దశకు కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు ఈసీబీని విజ్ఞప్తి చేశారు.'అని బోర్డుకు చెందిన అధికారి ఒకరు తెలిపాడు. ఇక ద్వైపాక్షిక సిరీస్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఈసీబీ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఐదో టెస్టు రద్దు చేయడం వల్ల బ్రాడ్‌కాస్టింగ్, గేట్ ఆదాయం ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) తమకు నష్టం వాటిల్లుతుందని.. బీసీసీఐ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఇక ఈసీబీ అధికారుల కండీషన్స్‌పై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు మ్యాచ్‌ను వాకోవర్ ఇచ్చే ప్రతిపాదనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్..
ఇక బయోబబుల్ దాటి పుస్తక ఆవిష్కరణకు వెళ్లడంపై కూడా ఈసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై తాము విచారణ ప్రారంభించామని బీసీసీఐ తెలిపింది. ఈ మొత్తం ఘటన ఇరు బోర్డుల మధ్య విభేదాలకు దారి తీసింది. టీమిండియా క్రికెటర్లు అందరూ నెగెటివ్‌గా తేలడంతో షెడ్యూల్ ప్రకారమే టెస్టు మ్యాచ్ ఆడతామని బీసీసీఐ అధికారులు తేల్చి చెప్పారు. ఇక టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ పాజిటివ్ తేలడంతో అతని బాధ్యతలు అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్‌కు అప్పగించారు. కానీ మరుసటి రోజు పర్మార్ కూడా పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు.
అతనికి సన్నిహితంగా మెలిగిన రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ మాత్రం నెగెటివ్ రావడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకున్నది. ప్రస్తుతం వీళ్లందరూ రాడిసన్ హోటల్‌లో ప్రత్యేక ఫ్లోర్‌లో బయోబబుల్‌లో ఉన్నారు. టెస్టు ముగిసే వరకు అక్కడే ఉండి.. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో ఐపీఎల్ 2021 రెండో దశ కోసం నేరుగా యూఏఈ వెళ్లనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications