Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: మీరు అన్నట్లు ఆడటానికి మేం ఏం మీ జూలోని జంతువులం కాదు!

Team India says We don’t want to be treated like animals in the zoo

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన నాలుగో టెస్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాలని చెప్పడంపై టీమిండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్‌ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దని, క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు రాస్‌ బేట్స్ చేసిన వ్యాఖ్యలపై భారత జట్టు ఘాటుగా స్పందించింది. వారు చెప్పినట్లు చేయడానికి తాము ఏం జూలోని జంతువులం కాదని జట్టుకు సంబంధించి ఓ అధికారి క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభిమానులకు అనుమతిచ్చి..

అభిమానులకు అనుమతిచ్చి..

మైదానాల్లోకి 20వేల మంది అభిమానులకు అనుమతించి ఆటగాళ్లను మాత్రం కఠిన ఆంక్షల మధ్య ఉండమనడం ఏ మాత్రం భావ్యం కాదని సదరు అధికారి అభిప్రాయపడ్డాడు. ‘అభిమానులను మైదానాల్లోకి అనుమతించి.. ఆటగాళ్లను మాత్రం హోటల్లో కఠిన ఆంక్షల మధ్య ఉండమనడం ఏ మాత్రం భావ్యం కాదు. మరి ముఖ్యంగా మా అందరికి నెగటీవ్ వచ్చిన తర్వాత కూడా క్వారంటైన్‌లో ఉండమనడం ఏ మాత్రం బాగోలేదు. మీరు అన్నట్లు ఆడటానికి మేం ఏం మీ జూలోని జంతువులం కాదు'అని ఆ అధికారి ఘాటుగా వ్యాఖ్యానించాడు.

అభ్యంతరం ఏంటంటే..?

అభ్యంతరం ఏంటంటే..?

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది.

అయితే సిరీస్‌ ఆరంభానికి ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు. ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్‌ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు.

బాయ్‌కట్ చేస్తాం..

బాయ్‌కట్ చేస్తాం..

‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి.

ఐపీఎల్‌ నుంచి మేం బబుల్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్‌లో మరో బబుల్‌ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం' అని భారత క్రికెట్‌ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది.

Story first published: Monday, January 4, 2021, 14:17 [IST]
Other articles published on Jan 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+