Team India Schedule 2021-2022: టీ20 ప్రపంచకప్ నుంచి కోహ్లీసేన ఔట్.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే!

న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో దారుణంగా విఫలమైంది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో చిత్తుగా ఓడి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకు గుండెకోతను మిగుల్చుతూ కనీసం సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగింది. అఫ్గాన్, స్కాట్లాండ్‌పై సాధించిన భారీ విజయాలతో ఆశలు రేకిత్తినా.. న్యూజిలాండ్ వాటిపై నీళ్లు చల్లింది. అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే ఎంచక్కా భారత్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత ఆశలను చిదిమేస్తూ అప్గాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. దాంతో భారత్ ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీగా గడపనుంది.
టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ భారత పర్యటనకు రానుండగా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లండ్‌తో వరుస సిరీస్‌లు ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా ఈ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా తదుపరి షెడ్యూల్‌పై ఓ లుక్కెద్దాం.

న్యూజిలాండ్ భారత పర్యటన
దాదాపు ఐదేళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. నవంబరు 17 నుంచి డిసెంబరు 7 వరకు మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్‌లను భారత్‌తో ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. తీరిక లేని షెడ్యూల్‌తో విసిగి పోయిన సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఐపీఎల్ స్టార్లను ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ సిరీస్‌లకు సంబంధించిన జట్ల వివరాలను వెల్లడించనుంది.
ఫస్ట్ టీ20- నవంబర్ 17, జైపూర్.
సెకండ్ టీ20- నవంబర్ 19, రాంచీ.
మూడో టీ20- నవంబర్ 21, కోల్‌కతా.
తొలి టెస్టు- నవంబర్ 25- 29, కాన్పూర్.
సెకండ్ టెస్టు- డిసెంబర్ 3-7, ముంబై.

టీమిండియా సౌతాఫ్రికా పర్యటన..
టీమిండియా డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
ఫస్ట్ టెస్టు- డిసెంబరు 17-21, జొహన్నస్‌బర్గ్.
సెకండ్ టెస్టు- డిసెంబరు 26-30, సెంచూరియన్
మూడో టెస్టు- జనవరి 3-7, కేప్‌టౌన్
మొదటి వన్డే- జనవరి 11, పర్ల్
రెండో వన్డే- జనవరి 14, కేప్‌టౌన్
మూడో వన్డే- జనవరి 16, కేప్‌టౌన్
మొదటి టీ20- జనవరి 19, కేప్‌టౌన్
రెండో టీ20- జనవరి 21, కేప్‌టౌన్
మూడో టీ20- జనవరి 23, కేప్‌టౌన్
నాలుగో టీ20- జనవరి 26, పర్ల్.

విండీస్ భారత పర్యటన
తొలి వన్డే- ఫిబ్రవరి 6, అహ్మదాబాద్
రెండో వన్డే- ఫిబ్రవరి 9, జైపూర్
మూడో వన్డే- ఫిబ్రవరి 12, కోల్‌కతా
తొలి టీ20- ఫిబ్రవరి 15, కటక్
రెండో టీ20- ఫిబ్రవరి 18, విశాఖపట్నం
మూడో టీ20- ఫిబ్రవరి 20, త్రివేండ్రం

శ్రీలంక భారత పర్యటన
తొలి టెస్టు- ఫిబ్రవరి 25- మార్చి 1, బెంగళూరు
రెండో టెస్టు- మార్చి 5-9, మొహాలి
తొలి టీ20- మార్చి 13, మొహాలి
రెండో టీ20- మార్చి 15, ధర్మశాల
మూడో టీ20- మార్చి 18, లక్నో.
ఐపీఎల్: మార్చి 25-మే 31 మధ్య ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహించే అవకాశం.

సౌతాఫ్రికా భారత పర్యటన:
మొదటి టీ20- జూన్ 9, చెన్నై
రెండో టీ20- జూన్ 12, బెంగళూరు
మూడో టీ20- జూన్ 14, నాగ్‌పూర్
నాలుగో టీ20- జూన్ 17, రాజ్‌కోట్
ఐదో టీ20- జూన్ 19, ఢిల్లీ

భారత్ ఇంగ్లండ్ పర్యటన..
రీషెడ్యూల్డ్ టెస్టు- జూలై 1-5, బర్మింగ్‌హాం
తొలి టీ20- జూలై 7, సౌతాంప్టన్
సెకండ్ టీ20- జూలై 9, బర్మింగ్‌హాం
మూడో టీ20- జూలై 10, నాటింగ్‌హాం
మొదటి వన్డే- జూలై 12, లండన్
రెండో వన్డే- జూలై 14, లండన్
మూడో వన్డే- జూలై 17, మాంచెస్టర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications