
ద్వితీయ శ్రేణి జట్టుతో..
గతంలో శిఖర్ ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక పర్యటనకు పంపించినట్లు సౌతాఫ్రికాతో కూడా అలానే యువ ఆటగాళ్లతో కూడి జట్టను ఆడించాలని బోర్డు భావిస్తుందని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. అయితే ఈ సారి ద్వితీయ శ్రేణి టీమ్ కెప్టెన్సీ రేసులో శిఖర్ ధావన్‌కు పోటీగా.. హార్దిక్ పాండ్యా నిలవనున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్‌ను కాదని హార్దిక్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే లీగ్‌లో సత్తా చాటుతున్న ఉమ్రాన్ మాలిక్, మోహ్‌సిన్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు టీమిండియా పిలుపును అందుకోవచ్చని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.

మూడున్నర వారాలు..
'సీనియర్ ఇండియా ప్లేయర్లంతా కనీసం మూడున్నర వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు. రోహిత్ విరాట్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రాలు నేరుగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్ట్‌తో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్నారు. కీలక ఆటగాళ్లందరిని ఫ్రెష్‌గా ఉంచడం మాకు చాలా ముఖ్యం. సెలెక్టర్ల ముందు పలు ఆప్షన్స్ ఉన్నాయి. విరాట్, రోహిత్, రాహుల్ గైర్హాజరీలో ధావన్ ఇప్పటికే జట్టును నడిపించాడు.

కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..
అయితే గుజరాత్ టైటాన్స్ సారథిగా హార్దిక్ పాండ్యా సత్తా చాటుతున్నాడు. ఈ ఇద్దరిలో ఒకరు సౌతాఫ్రికాతో భారత జట్టును నడిపించనున్నారు. పేస్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బాగుంది కాబట్టి సెలెక్టర్లు పెద్దగా ప్రయోగాలు ఏం చేయకపోవచ్చు. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటుతున్న మోహ్‌సిన్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్,అర్షదీప్ సింగ్‌ల పేర్లను పరిశీలించవచ్చు. ఈ ముగ్గురిలో మోహ్‌సిన్ ఖాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.'అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు. ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశ ముగిసే రోజు మే 22న సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ బరిలోకి దిగే జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు.


Click it and Unblock the Notifications
