
నాన్న కల అదే:
'ఇది షాకింగ్ న్యూస్. చాలా బాధగా ఉంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నేను నా జీవితంలో అతిపెద్ద మద్దతును కోల్పోయాను. దేశం తరఫున ఆడటం నాన్న కల. టీమిండియాకు ఆడి నాన్న కలను నెరవేర్చినందుకు సంతోషిస్తున్నా. నాన్న ఎప్పుడూ ఒకేటే అనేవారు.. నా కొడుకు నా దేశాన్ని గర్వించేలా చేయాలనేవారు' అని మహ్మద్ సిరాజ్ అన్నాడు. సిరాజ్ భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు ఆడాడు. 35 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు. ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే.

ఆటో డ్రైవర్‌గా సిరాజ్ కలను ప్రోత్సహించారు:
పేద కుటుంబంలో పుట్టిన మహ్మద్ సిరాజ్.. భారత క్రికెటర్‌గా ఎదగడంలో మహ్మద్ గౌజ్ కీలకపాత్ర పోషించారు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూ సిరాజ్ కలను ప్రోత్సహించారు. ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు రూ.2.6 కోట్లకు సొంతం చేసుకోవడంతో సిరాజ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత భారత్-ఎ జట్టులో చోటు దక్కించుకున్న అతడు నిలకడైన ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇటీవల కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ సంచలన ప్రదర్శన చేశాడు. లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక్కపరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీసిన బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.

4-2-8-3.. సిరాజ్ గణాంకాలు:
ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసిన సిరాజ్.. వరుస బంతుల్లో రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణాను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టామ్ బాంటన్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 4-2-8-3.. ఇవి సిరాజ్ గణాంకాలు. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం చాలా కష్టం.

ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటోనే బేటా:
అయితే కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు మహ్మద్ సిరాజ్ తండ్రి హాస్పిటల్ పాలయ్యారు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కోలుకుని సిరాజ్తో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటో ఉంది బేటా అని ఆయన సంతోషించారు. ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మీ అబ్బాయి బాగా ఆడాడని చెప్పారని పేర్కొన్నారు.
రవిశాస్త్రి.. ఆ మాటకు కట్టుబడి ఉంటారా!! నాకు సందేహమే: హర్భజన్


Click it and Unblock the Notifications












