
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు
పృథ్వీ షా తనపై వచ్చే విమర్శలకు నేరుగా స్పందించలేక ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. 'ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తుంటే.. కొందరు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అంటే.. మేము ఏదో ఒకటి చేయగలమని, వాళ్లు ఏమీ చేయలేరని అర్థం' అని షా ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచీ సరిగ్గా ఆడటం లేదు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన షా.. ఆ తర్వాత ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా మంచి ప్రదర్శన చేయలేకపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనలోనూ రాణించలేకపోతున్నాడు.

రెండో టెస్టుకు కష్టమే:
అంతకుముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో విఫలమైనా.. టెస్టుల్లో పృథ్వీ షాకు మెరుగైన గత రికార్డు ఉండడంతో టీమిండియా మేనేజ్మెంట్ అడిలైడ్ టెస్టుకు ఎంపిక చేశారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తొలి టెస్టుకు షాని ఎంపిక చేసినప్పుడే పలువురు మాజీలు స్పందించారు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అతడికి బదులు శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాల్సిందని పేర్కొన్నారు. తొలి టెస్టులో 0, 4 పరుగులు చేయడంతో రెండో టెస్టుకు అతడిని తొలగించే వీలుందని మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. ఒకవేళ అదే నిజమైతే.. షా ఇక మిగతా రెండు టెస్టుల్లోనూ ఆడడం సందేహమే.

డే/నైట్ టెస్టులో 0, 4 రన్స్:
డే/నైట్ టెస్టులో మయాంక్ అగర్వాల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన పృథ్వీ షా పూర్తిగా నిరచాపరిచాడు. ఫామ్‌లో ఉన్న మరో యువ ఓపెనర్ శుభమన్ గిల్‌ని కాదని తొలి టెస్టుకి షాని ఎంపిక చేయడంపై ఫాన్స్ పెద్ద ఎత్తున మణిపడ్డారు. వాస్తవానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అదే సమయంలో షా విఫలమయ్యాడు. దీంతో తొలి మ్యాచ్‌కు ఒకరోజు ముందు ప్రకటించిన తుది జట్టులో గిల్ ఉంటాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా షాకు చాన్స్ దక్కింది. కానీ షా ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. డకౌట్ అయి విమర్శల పాలయ్యాడు.

సులువైన క్యాచ్ నేలపాలు:
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 23వ ఓవర్‌లో మార్నస్ లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా వదిలేశాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అయితే షా వదిలేసిన క్యాచ్ అంత కష్టంగా కూడా ఏమీ లేదు. దీంతో తడిని నెటిజన్లు టార్గెట్ చేశారు. 'ఆ క్యాచ్ కూడా పట్టవా?' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'పృథ్వీ షా జట్టుకు భారంగా మారాడు' అని మరో నెటిజన్ ట్వీటాడు. 'నీకు బ్యాటింగే రాదనుకున్నాం.. ఇప్పుడు క్యాచ్ పట్టడం కూదా రాదని తెలిసిపోయింది', 'షా కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది', 'క్యాచ్‌లు పట్టడం రానివాడు అంతర్జాతీయ క్రికెట్లోకి ఎలా వచ్చాడు' అంటూ షాను అందరూ ఆటాడుకున్నారు.


Click it and Unblock the Notifications

యథావిధిగా సిడ్నీ టెస్టు.. వేదిక మార్చే ప్రసక్తే లేదు: సీఏ