న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

 Team India limited-overs vice-captain Rohit Sharma Net Worth and Salary Details

హైదరాబాద్: భారత క్రికెట్‌లో అత్యంత ఆదరణ కలిగిన ఆటగాళ్లలో టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతలా ఉందంటే ఇతర క్రికెట్ అభిమానులతో గొడవపడేంత.. 2007లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. 2013 వరకు జట్టులో నిలకడగా అవకాశాలు అందుకోలేకపోయాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పుణ్యమా చాంపియన్స్ ట్రోఫీలో ఎప్పుడైతే ఓపెనర్‌గా అవతారమెత్తాడో అప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగేలేకుండా పోయింది. మూడు వన్డే డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా ఈ ముంబై క్రికెటర్ గుర్తింపు పొందాడు.

Rohit Sharma Net Worth and Salary, Cars Details || Oneindia Telugu
170 కోట్ల నెట్ వర్త్..

170 కోట్ల నెట్ వర్త్..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలోనూ రోహిత్ శర్మ భారత జట్టును నడిపించాడు. ఆసియాకప్, నిదహాస్ ట్రోఫీల్లో జట్టుకు విజయాలను కూడా అందించాడు. ఇక ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్‌ తరఫున ఇప్పటికే ఐదు ఐటిళ్లు సాధించాడు. భారత క్రికెట్‌లో ఓ బ్రాండ్ అయిన రోహిత్ శర్మ సంపాదనలోనూ దూసుకెళ్తున్నాడు. అతని క్రికెట్ కాంట్రాక్టులు, ఇతర ఆదాయం, ఆస్థులు నుంచి అతను చెల్లించాల్సిన డబ్బులు మొత్తం తీసేయగా.. రోహిత్ శర్మ సంపద రూ.170 కోట్లు (నెట్‌వర్త్) ఉంటుందని ఓ అంచనా.

బీసీసీఐ కాంట్రాక్టు రూ.7 కోట్లు..

బీసీసీఐ కాంట్రాక్టు రూ.7 కోట్లు..

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులో రోహిత్ శర్మ ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్నాడు. ఈ కేటగిరిలో రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాలే ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందనుంది. అంతేకాకుండా బీసీసీఐ ప్రతీ ఆటగాడికి టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజు అందిస్తుంది. ఈ లెక్కన కూడా రోహిత్ ఆడిన మ్యాచ్‌లకు తగ్గ మ్యాచ్ ఫీజు అందనుంది.

రూ.15 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టు..

రూ.15 కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టు..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. 2018 మెగా వేలం అనంతరం ప్రతీ సీజన్‌లో రూ. 15 కోట్ల వేతనాన్ని అందుకుంటున్నాడు. అంతేకాకుండా పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ భారీగానే డబ్బును ఆర్జిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున జియో కంపెనీతో పాటు వ్యక్తిగతంగా పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్, వేగ, గ్లెన్‌మార్క్, ఫార్మా వేరియంట్ క్యాండిడ్ పౌడర్, డాక్టర్ ట్రస్ట్, నాయిస్, ఓక్లే, సీట్, హబ్లట్ తదితర కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ బ్రాండ్ అడ్వర్టైస్ మెంట్స్ ద్వారా హిట్‌మ్యాన్ ఏడాదికి సుమారు రూ. 7 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం.

 రూ.30 కోట్ల విలువైన ఇల్లు..

రూ.30 కోట్ల విలువైన ఇల్లు..

ముంబై సిటిలోనే అత్యంత ధనిక ప్రదేశం, సీ ఫేస్ ప్రాంతమైన వోర్లిలో రోహిత్ శర్మకు ఖరీదైన ఇల్లు ఉంది. ప్రస్తుతం అతను 6000 స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈ అపార్ట్‌మెంట్‌కు 270 డిగ్రీలు అరేబియా సముద్రమే కనిపిస్తుంది. ఈ అపార్ట్‌మెంట్ 29 ఫ్లోర్లతో పూర్తిగా ఫర్నిష్ చేయబడింది. దీని ధర సుమారు రూ.30 కోట్లు ఉంటుందనేది ఓ అంచనా. ఇక రోహిత్ శర్మ ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అతను తొలుత స్కోడా లారా కారు కొన్నాడు. ఆ తర్వాత టయోట ఫార్చునర్, బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ఫార్ములా వర్షన్ బీఎమ్‌డబ్ల్యూ M5 కారు కూడా కొన్నాడు. అతనికి మెర్సిడెస్‌తో పాటు ఆడి, నిస్సాన్ కార్లు కూడా ఉన్నాయి. అతని ఆదాయం, ఆస్థుల నుంచి అప్పులు తీసేయగా.. అతని నికర విలువ రూ.170 కోట్లు అనేది బిజినెస్ వర్గాల సమాచారం. అత్యధికంగా సంపాదిస్తున్న భారత క్రికెటర్లలో ధోనీ, కోహ్లీ తర్వాత రోహితే మూడో వాడు.

Story first published: Monday, May 17, 2021, 14:21 [IST]
Other articles published on May 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X