Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా పంత్‌ను వదిలేసింది.. మీరు కూడా వదిలేస్తారా?! రోహిత్‌ శర్మ సూటి ప్రశ్న!

Team India leave Rishabh Pant alone, Are you prepared to do the same: Rohit Sharma asks Media

అహ్మదాబాద్: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్‌పై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా వదిలేస్తే 'మ్యాచ్‌ విన్నర్'గా నిలుస్తాడని భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పంత్‌పై ఒత్తిడి లేకుండా చూసేందుకు టీమిండియా కట్టుబడి ఉందని, మీడియా కూడా అలా వదిలేస్తుందా? అని రోహిత్ సూటిగా ప్రశ్నించాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన హిట్‌మ్యాన్‌ రోహిత్.. పంత్‌ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని సూచించాడు. అతడిని ఎంత స్వేచ్ఛగా వదిలేస్తే అంత బాగా రాణిస్తాడని రోహిత్ చెప్పుకొచ్చాడు.

పంత్‌ను వదిలేశాం

మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య తొలి టీ20 ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్ శర్మ బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'మేం రిషబ్ పంత్‌ను వదిలేశాం. తనకు ఇష్టమొచ్చినట్లు ఆడడానికి స్వేచ్ఛనిచ్చాం. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు పంత్‌ గురించి ఆలోచించకుండా ఉంటారా? అతడిని స్వేచ్ఛగా వదిలేస్తారా? అందుకు సిద్ధంగా ఉన్నారా?' అని మీడియాను రోహిత్‌ ప్రశ్నించాడు.

అతడిని మరేదీ ఆపలేదు

అతడిని మరేదీ ఆపలేదు

'రిషబ్ పంత్‌ను సహజసిద్ధమైన ఆటే ఆడనివ్వండి. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. ఇక నుంచి పంత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లపై టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. మీడియా ఒత్తిడి తేవడం తప్పించి అతడిని మరేదీ ఆపలేదు' అని మీడియాతో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. 'పంత్ ఆట గురించి ఓ విషయం చెపుతున్నా.. అతను ప్రస్తుతం ఆట పరిస్థితిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. పరిస్థితికి అనుగుణంగా ఎలా ఆడాలో తెలుసుకున్నాడు. ఇది మంచి విషయం. ఇది వ్యక్తిగతంగానూ ఉపయోగపడుతుంది' అని రోహిత్ ముగించాడు.

అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా

అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా

ఐపీఎల్ 2020 సమయంలో పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రిషబ్ పంత్.. గత రెండు మూడు నెలల్లోనే భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ (97: 118 బంతుల్లో 12x4, 3x6), గబ్బా ‌(89; 138 బంతుల్లో 9x4, 1x6) టెస్టుల్లో రెచ్చిపోయిన పంత్.. టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇంగ్లండ్‌తోనూ జరిగిన చివరి టెస్టులో శతకం (101; 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు.

రేపే ఆరంభం

రేపే ఆరంభం

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. చివరి రెండు టెస్టులు జరిగిన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలోనే 5 టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా.. టెస్టుల్లోలానే టీ20ల్లో కూడా ఇంగ్లండ్‌ను చిత్తుచేయాలని ఉవ్విళ్లూరుతోంది. కనీసం పొట్టి సిరీస్‌లోనైనా నెగ్గి.. లెక్క సరిచేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే ప్రపంచ టీ20 ర్యాకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇయాన్ మోర్గాన్ సేనను ఆపడం భారత బౌలర్లకు అంత సులువు కాదు. మ్యాచులు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

'ఒకప్పుడు మ్యాచ్ చూసేందుకు 4:30 గంటలకు నిద్రలేచేవాడిని.. ఇప్పుడు నా ఆట చూసేందుకు అభిమానులు లేస్తున్నారు'

Story first published: Thursday, March 11, 2021, 15:13 [IST]
Other articles published on Mar 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+