
యుద్ధానికి వెళ్తున్నట్లు అనిపించింది
తాజాగా శుభ్‌మన్ గిల్.. తన ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు. 'ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో ఫీల్డింగ్ చేసేంతవరకు సాధారణంగానే ఉన్నా. బ్యాటింగ్‌కు దిగినప్పుడు, డ్రెస్సింగ్ రూమ్ నుంచి పిచ్ వద్దకు నడుస్తున్నప్పుడు, అభిమానులు అరుస్తున్నప్పుడు.. వింతగా అనిపించింది. నిజానికి యుద్ధానికి వెళ్తున్న అనుభూతి కలిగింది. ఇక రవిశాస్త్రి నాకు టెస్టు టోపీ అందజేసినప్పుడు ఎన్నో భావోద్వేగాలు కలిగాయి' అని గిల్ అన్నాడు. ఆసీస్ పర్యటనలో గిల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

కొన్నిసార్లు మాటలు రావు
'అదో అనిర్వచనీయ అనుభూతి. విపరీతమైన భావోద్వేగం కలిగినప్పుడు కొన్నిసార్లు మాటలు రావు. అప్పుడు నేనలా ఉన్నా. రవిశాస్త్రి జట్టుతో మాట్లాడాడు. ఆ తర్వాత నాకు టోపీ ఇచ్చాడు. వెంటనే టాస్ వేశారు. మేం ఫీల్డింగ్‌కు వెళ్లిపోయాం. ఆపై బ్యాటింగ్ చేశా' అని టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అప్పటి సంగతులు గుర్తుచేసుకొన్నాడు. 'మెల్‌బోర్న్‌లో అరంగేట్రం చేస్తానని అడిలైడ్ మ్యాచుకు ముందే తెలుసు. దాంతో మ్యాచుకు ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దాంతో నిద్రమాత్ర వేసుకున్నా' అని గిల్ చెప్పుకొచ్చాడు.

ఉదయం 4:30 గంటలకు నిద్రలేచేవాడిని
'నా బాల్యంలో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచులు చూసేందుకు ఉదయం 4:30 గంటలకు నిద్రలేచేవాడిని. ఇప్పుడు అభిమానులు నా ఆట చూసేందుకు నిద్రలేస్తున్నారు. అదో గొప్ప అనుభూతి. ఆసీస్ సిరీసులు చూసేందుకు నా తండ్రి ఉదయాన్నే నన్ను నిద్రలేపడం ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో బ్రెట్ లీ బౌలింగ్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసేందుకు సరదాగా ఉండేది. ఇప్పుడదే ఆసీస్ బౌలర్లు నాకు బంతులేస్తుండటం వింతగా అనిపించింది. ప్రపంచం నా ఆటను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారత డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంటుంది' అని గిల్ తెలిపాడు.

మూడు టెస్టుల్లో 259 పరుగులు
ఆసీస్ పర్యటనలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలి టెస్టులో విఫలమవడంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని శుభ్‌మన్ గిల్ ఒడిసిపట్టాడు. మూడు టెస్టు మ్యాచ్‌లాడి 259 పరుగులు చేశాడు. ముఖ్యంగా నాలుగో టెస్టు జరిగిన గబ్బా మైదానంలో గిల్ 91 పరుగుల కీలక ఇన్నింగ్స్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఆసీస్ పర్యటన ప్రదర్శనతో స్వదేశంలో ఇంగ్లడ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే పరుగుల వరద మాత్రం పారించలేదు.
India vs England: టీమిండియానే టీ20 ప్రపంచకప్ ఫేవరెట్.. ఎందుకంటే: జోస్ బట్లర్


Click it and Unblock the Notifications
