
ఆటగాడిగానే కొనసాగేందుకు..
కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగేందుకు విరాట్ కోహ్లీ ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మునపటిలా బ్యాటింగ్‌లో సత్తా చాటాలనుకుంటున్నాడని, అందుకే కెప్టెన్సీ భారాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాడని సమాచారం. టీ20 ప్రపంచకప్ ఘోర ఓటమి నేపథ్యంలో బీసీసీఐ కూడా విరాట్‌పై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా సెమీస్ చేరకపోవడంతో ఆతిథ్య బోర్డుగా వేల కోట్లలో నష్టం రానుంది. పైగా సొంత అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అంతేకాకుండా భారత్ ఐసీసీ టైటిల్స్ గెలవక 8 ఏళ్లు అవుతోంది. చివరిసారిగా 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే మెగాటోర్నీలకు సరైన కార్యచరణను రూపొందించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

ద్రవిడ్‌తో కోహ్లీ కెప్టెన్సీకి చెక్..
ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2022 టీ20 ప్రపంచకప్‌తో పాటు భారత్ వేదికగా జరిగే 2023 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా బీసీసీఐ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీపై వేటు వేసేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరిగింది.
తనకు వ్యతిరేకంగా బోర్డు చేస్తున్న పనులు తెలుసుకున్న కోహ్లీ.. ముందు జాగ్రత్తగానే టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుటు టీ20 ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో వన్డే కెప్టెన్సీని వదులుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సుదీర్ఘకాలం ఆడేందుకే..
ఇక తనకు పెద్దన్నలాంటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పదవి కాలం ముగియడం, టీమిండియాలోని తన కోటరీ నుంచి ఒక్కక్కరూ తప్పుకోవడంతో కోహ్లీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. పైగా కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తన మాట వినకపోవడం వంటి విషయాలతో కోహ్లీ విసిగిపోయినట్లు తెలుస్తోంది.
కోహ్లీ ఏది చెబితే అది వినడానికి రాహుల్ ద్రవిడ్.. రవిశాస్త్రి ఏం కాదని, అందుకే రిస్క్ లేకుండా గౌరవంగా తప్పుకోవాలని విరాట్ భావిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునపటిలా రాణించకుంటే జట్టు నుంచి కూడా తీసేసేందుకు రాహుల్ ద్రవిడ్ వెనుకాడడనే విషయం కోహ్లీకి బాగా తెలుసని, అందుకే తన కెరీర్ డేంజర్‌లో పడకుండా ఉండాలనే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్‌గా విఫలం..
బ్యాటింగ్‌లో మునపటి స్థాయి చూపలేకపోతున్న విరాట్ కోహ్లీ కెప్టెన్‌గానూ నిరాశ పరుస్తున్నాడు. అతని సారథ్య వైఫల్యం టీమ్‌ను దెబ్బకొడుతుంది. అసలు ఐసీసీ ఈవెంట్స్‌లో కోహ్లీ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? బైలేటరల్ సిరీస్‌ల్లో ఎందుకంత సక్సెస్ సాధించాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కోహ్లీ సెలెక్షన్‌లో సహజంగానే స్థిరత్వం కనిపించదు.
కివీస్‌తో పోరునే చూస్తే రోహిత్‌కు బదులు ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించడం ప్రతికూల ప్రభావం చూపించింది. రోహిత్‌కు రక్షణ కల్పించాలనుకున్న విరాట్ కోహ్లీ తాము ఒత్తిడిలో ఉన్నామని ప్రత్యర్థికి సిగ్నల్ ఇచ్చాడనే చెప్పొచ్చు. అది సక్సెస్‌పుల్ కెప్టెన్ లక్షణం కాబోదు. టాస్ గెలిచే అలవాటు లేకపోవడం కూడా విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా కొంపముంచింది. ఈ టోర్నీలో పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో కోహ్లీ టాస్ ఓడిపోవడం జట్టు ఫలితాన్ని శాసించింది. ఈ వైఫల్యాల నేపథ్యంలోనే కోహ్లీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాన్ని తగ్గించుకొని స్వేచ్చగా ఆడేందుకే కోహ్లీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications
