
పుజారాపై వేటు
డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటలను బట్టి చూస్తే జట్టులో సమూల మార్పులు ఖాయం అని స్పష్టం అయింది. టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారాపై వేటు పడనుందని సమాచారం. గత మూడు సంవత్సరాలుగా, 18 టెస్ట్ మ్యాచులలో పుజారా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇక స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా ఉంటోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 34 బంతులు ఆడికాని పరుగుల ఖాతా తెరవలేదు. దీంతో కనీసం స్ట్రైక్ రొటేట్ చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. కీలకమైన మూడో స్థానంలో వేగంగా పరుగులుచేయకపోడం కూడా తర్వాతి బ్యాట్స్‌మన్‌పై భారం పడుతోంది. కాబట్టి పుజారాపై వేటు వేసి.. విరాట్ కోహ్లీని మూడో స్థానంలో ఆడించనున్నారని సమాచారం.

రాహుల్‌కి చోటు
పరిమిత ఓవర్లలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ టెస్టుల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. శుభ్‌మన్ గిల్ రాకతో రాహుల్‌కి చోటు కష్టమైంది. అయిదు ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు గిల్. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ విఫలమయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 64 బంతుల్లో 24 పరుగులు చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముందు గిల్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది. గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్‌ను గిల్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. రోహిత్ శర్మతో పాటు రాహుల్ ఓపెనర్‌గా రానున్నాడు. మయాంక్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.
Tokyo Olympics 2021 విజేతలకు స్టాలిన్ భారీ ఆఫర్.. గోల్డ్ గెలిస్తే 3 కోట్లు!!

విహారికి అవకాశం
విదేశాల్లో భారత్ బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమవుతోంది. ముఖ్యంగా మిడిలార్డర్లో జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ ఒక్కరు ఆడట్లేదు. ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఇదే స్పష్టం అయింది. దీంతో మిడిలార్డర్ పలు మార్పులు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. రవీంద్ర జడేజా గొప్ప ఆటగాడు అయినా ఇంగ్లండ్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించడం వల్ల అతడు జట్టులో ఉండటం అనుమానంగా మారింది.
ఇక ఇంగ్లీష్ పిచ్‌లపై హనుమ విహారి ప్రదర్శన బాగానే ఉంది. బ్యాటింగ్ విభాగంలో భారత్ ఆధిపత్యం వహించాలంటే.. మరో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అవసరం. దీంతో జడేజా స్థానంలో విహారిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. విదేశాల్లో విహారి ప్రదర్శన కూడా బాగుండడం అతనికి కలిసొచ్చే అంశం. ఒకవేళ గిల్ తన స్థానంలో కొనసాగితే.. రాహుల్, విహారి మధ్య పోటీ నెలకొంటుంది.

ఇషాంత్ ఔట్
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ స్వింగ్ బౌలర్ల కొరతను ఎదుర్కొంది. భువనేశ్వర్ కుమార్ శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పయనమవగా.. మొహ్మద్ సిరాజ్ లేదా శార్దూల్ ఠాకూర్‌లో ఒకరు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం బరిలోకి దిగే అవకాశం ఉంది. 100 టెస్టులు ఆడిన అనుభవం కలిగిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ.. కివీస్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు.
గాయం కూడా అవడంతో అతడిని ఇంగ్లండ్ సిరీస్‌కు పక్కనపెట్టే అవకాశాలే ఎక్కువ. ఆస్ట్రేలియా పర్యటనలో తన బౌలింగ్‌తో సత్తాచాటిన సిరాజ్.. ఇషాంత్ స్థానంలో ఆడనున్నాడు. ఒకవేళ ఆల్‌రౌండర్‌తో బరిలో దిగాలనుకుంటే ఠాకూర్‌ను బరిలో దించే అవకాశం ఉంటుంది. పేస్ బౌలింగ్‌తో పాటు కీలక సమయంలో బ్యాట్‌తోనూ ఠాకూర్ రాణించగలడు.


Click it and Unblock the Notifications












