Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు.. గుంత లకడి గుల గుల గుల.. హుహా..హుహా! అంటూ రచ్చ (వీడియో)

Team India dressing room celebrations after win ODI series against West Indies goes viral

పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలోనూ భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి వన్డే తరహాలోనే ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మళ్లీ భారతే పై చేయి సాధించింది. కాకపోతే తొలి వన్డేలో విజయం కోసం విండీస్ పోరాడితే... రెండో మ్యాచ్‌లో భారత్ చెమటోడ్చింది. అక్షర్ పటేల్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ పుణ్యమా టీమిండియా విజయాన్నందుకుంది.

ఈ విజయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్‌కు ధావన్ నాయకత్వం వహించాడు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్న టీమిండియా.. హుహా హుహా అంటూ రచ్చ చేశారు. ఈ వీడియోను శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో ఆటగాళ్లంతా ధావన్‌ను అనుసరిస్తూ రచ్చ చేశారు.

పిడికిలి బిగించి 'ఏయ్ కమాన్.. హహహ'అంటూ ధావన్ అరవగా.. భారత ఆటగాళ్లు అతన్ని అనుసరించారు. 'టాలెంట్ మ్యాచ్‌లను గెలిపిస్తుంది. కానీ టీమ్ వర్క్, ఇంటలిజెన్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలబెడుతుంది. కుడోస్ టీమ్'అంటూ ఈ వీడియోకు ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'గుంత లకడి గుల గుల గుల.. హుహా..హుహా..'అనాల్సిందని.. మల్లెపువ్వు తెలుపు.. టీమిండియా గెలుపు అని అరవాల్సిందని సూచిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. కెరీర్‌లో 100వ వన్డే ఆడిన ఓపెనర్ షై హోప్(135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, చాహల్, అక్షర్ పటేల్‌ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(13) విఫలమైనా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. ఇక శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 63), సంజూ శాంసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దీపక్ హుడా సాయంతో అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. హుడా వెనుదిరిగినా.. సిరాజ్(1 నాటౌట్) సాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Monday, July 25, 2022, 11:28 [IST]
Other articles published on Jul 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+