
దేవుడు దేశాన్ని చల్లగా చూడాలి..
‘ప్రతీ ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు దేశాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మనల్ని క్షేమంగా ఉంచడానికి కుటుంబాలకు దూరంగా ఉంటూ పోరాడుతున్న సైనికులకు వందనం. జైహింద్'-కెప్టెన్ విరాట్ కోహ్లీ
‘అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశం కోసం నిలబడటం కన్నా మించింది ఏదీ లేదు'-రోహిత్ శర్మ
‘ఈ గొప్ప దేశంలోని ప్రతీ పౌరుడికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.'-బీసీసీఐ

దేశం కోసం ఆడటం గర్వకారణం..
‘అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నప్పుడు ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లం. పిల్లలందరం ఉదయాన్నే నిద్రలేచి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవ్వడం... తర్వాత మిఠాయిలు తినడం. అనంతరం నేను ప్రాక్టీస్‌కు వెళ్లడం నాకింకా గుర్తుంది. మళ్లీ అలాంటి రోజు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి దేశం విముక్తి పొందాలి. అందరూ తమ వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికి ఒకరు సాయం చేసుకొని ఇంట్లోనే ఉండండి.'- అజింక్య రహానె
‘దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు'-హర్భజన్ సింగ్
‘దేశం కోసం ఆడటం నాకు గర్వకారణం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు'-శిఖర్ ధావన్

వోకల్ ఫర్ లోకల్..
‘ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి ముఖ్యకారణమైన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిద్దాం. మన త్రివర్ణ పతాకం ఎప్పుడూ సగర్వంగా మరింత ఎత్తులో రెపరెపలాడాలి. ఈ సందర్భంగా అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు' -బీసీసీఐ కార్యదర్శి జైషా
‘ఈ రోజు మనం 74వ స్వాత్రంత్య దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా మన స్వాతంత్ర్య సమరయోధులకు, వీర జవాన్లను గౌరవిద్దాం. మన దేశం ఏం చేయగలదనే దానిపైనే మన బలం ఉంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాటిపై కాదు. వోకల్‌ఫర్‌లోకల్. మేకిన్‌ఇండియా. జైహింద్.'-కోచ్ రవిశాస్త్రి
‘టీమింయా జెర్సీ ధరించడంతో వచ్చే గర్వం మరోదానిలో ఉండదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.' -మయాంక్ అగర్వాల్

రియల్ హీరోలకు సెల్యూట్
‘స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛను ఆస్వాదించడమే. అలాగే ఇతరులు చేసేదాన్ని కూడా ప్రోత్సహించడం. మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహానీయులకు కృతజ్ఞతలు. ఆ దేవుడు ఈ దేశాన్ని చల్లగా చూడాలి'-వీరేంద్ర సెహ్వాగ్
‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వేచ్చను ప్రసాదించిన మన ఫ్రీడమ్ ఫైటర్స్‌ను స్మరించుకుందాం. వారితో పాటు ఇప్పటికి మన రక్షణ కోసం కృషిచేస్తున్న జవాన్లకు సెల్యూట్ చేద్దాం.'-సురేశ్ రైనా
‘జలియన్ వాలా బాగ్ ఊచకోత నా హృదయాన్ని కలిచివేసింది. స్వాతంత్ర్య ఉద్యమం నా గుండెను ఉప్పొంగేలా చేసింది. ఎట్టకేలకు 1947లో మనం స్వాతంత్ర్యం సాధించాం. త్వరలోనే కరోనా మహమ్మారిని కూడా జయిస్తాం. కోట్లాది భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.'-అశ్విన్
తప్పుకున్న టెన్నిస్ బ్యూటీ బియాంక.. డిఫెండింగ్ చాంపియన్స్ లేకుండానే యూఎస్ ఓపెన్!


Click it and Unblock the Notifications
