Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి వార్తల్లో కేఎల్ రాహుల్-అతియా శెట్టి ప్రేమాయణం!

Team India Cricketer KL Rahul comment on rumoured girlfriend Athiya Shettys post

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. అయితే తాజాగా అతియా శెట్టి పోస్ట్‌లకు రాహుల్ స్పందించడంతో వీరీ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.

ఇటీవలే అతియా అద్దం ముందు స్విమ్ సూట్‌లో సెల్ఫీ దిగిన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె తన స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టారు. ఈ హాట్ ఫోటోపై రాహుల్ 'జెఫా'అని కామెంట్ చేశాడు. చాలా మందికి ఇది అర్థం కాక జుట్టు పీక్కున్నారు. అయితే జెఫా అంటే స్పానిష్ భాషలో బాస్ అని అర్థమని ఓ నెటిజన్ తెలిపాడు.

View this post on Instagram

💜

A post shared by Athiya Shetty (@athiyashetty) on

తాజాగా అతియా షేర్ చేసిన ఓ పోస్ట్‌పై కూడా రాహుల్ స్పందించాడు. నిన్న తన తల్లి మనా శెట్టి పుట్టిన రోజును పురస్కరించుకొని అతియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో తల్లీ కూతుళ్లిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకొని సంతోషంగా ఉన్న ఫొటోను షేర్ చేసింది. తన తల్లి పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్త పరుస్తూ 'నా ప్రేమమూర్తికి ఏ పదాలు కూడా సరితూగవు. ఐ లవ్యూ అమ్మా' అని పేర్కొంది. ఇది చూసిన రాహుల్ తాను కూడా ప్రేమిస్తున్నట్లు అర్థం వచ్చేలా లవ్‌ సింబల్‌ ఏమోజీని పోస్టు చేశాడు. ఆ కామెంట్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వందలాది లైకులు కొట్టడమే కాకుండా పలువురు కామెంట్లు కూడా చేశారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇక రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి విషెస్ చెబుతూ.. అతియా ఇన్‌స్టాలో ఒక పోస్టు చేసింది. రాహుల్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకొని 'మై పర్సన్‌' అనే క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్ట్ కూడా వీరి ప్రేమాయాణ వార్తలకు బలం చేకూర్చింది. ఇక ఐపీఎల్ కోసం రాహుల్ దుబాయ్ వెళ్లాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు.

Story first published: Monday, August 24, 2020, 12:02 [IST]
Other articles published on Aug 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+