Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన టీమిండియా!

టీమిండియా చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డ్ సాధించింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత్‌కు ఇది 7వ విజయం. దాంతో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. భారత్ ఏడు విజయాలు నమోదు చేసింది. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2024లో తొలి మ్యాచ్ టై అవ్వగా.. బాల్ ఔట్ పద్దతిలో టీమిండియా గెలుపొందింది. ఫైనల్లో ఇరు జట్లు మరోసారి తలపడగా.. భారత్ విజయం సాధించి తొలి టైటిల్‌ను ముద్దాడింది. 2009 టీ20 ప్రపంచకప్‌ల్లో ఇరు జట్లు వేర్వేరు గ్రూప్‌‌ల్లో ఉండటంతో తలపడలేదు.

Team India creates history with thrilling six-run win over Pakistan in T20 World Cup 2024

2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను పాకిస్థాన్ ఓడించింది. ఈ ఒక్క విజయం మినహా మిగతా ఏడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డునే టీమిండియా అధిగమించింది. బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ 6 సార్లు విజయం సాధించగా.. వెస్టిండీస్‌పై శ్రీలంక కూడా 6 సార్లు గెలుపొందింది.

టీ20ల్లో అతి తక్కువ పరుగులను డిఫెండ్ చేసుకున్న రెండో జట్టుగా కూడా టీమిండియా రికార్డు సాధించింది. భారత్ కంటే ముందు జింబాబ్వే ఉంది. ఆ జట్టు 119 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో మాత్రం అతి తక్కువ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న జట్టుగా శ్రీలంక సరసన నిలిచింది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) మినహా అంతా విఫలమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.

Story first published: Monday, June 10, 2024, 15:23 [IST]
Other articles published on Jun 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+