రోహిత్ చెవి దగ్గర్లో బెలూన్లను
ఈ పార్టీలో జట్టు సభ్యులంతా ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకల్లో భాగంగా కోహ్లీ పక్కనుండగా.. రోహిత్ శర్మ కేక్ కట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. రోహిత్ వెనకాల నిల్చుని ఉన్న మిస్టర్ కూల్ ధోని, రవీంద్ర జడేజాలు అతని చెవి దగ్గర్లో బెలూన్లను పగులకొట్టారు. దీంతో రోహిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు..
ర్యాంకుల్లో తనతో పాటు భారత్‌నూ టాప్‌లో నిలిపిన కోహ్లీ

ధోనితో పాటు ఇతర ఆటగాళ్లంతా
రోహిత్ స్పందించిన తీరును చూసి అక్కడున్న ధోనితో పాటు ఇతర ఆటగాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు. కేక్ కటింగ్ అనంతరం టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆఖరి వన్డేలో 9 వికెట్ల తేడాతో
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. తిరుగులేని ఆధిపత్యంతో ఆఖరి వన్డేలో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఎడమచేతివాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా (4/34)తో పాటు ఇతర బౌలర్లు కూడా విజృంభించడంతో మొదట వెస్టిండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. హోల్డర్ (25) టాప్ స్కోరర్.

ఆదివారం నుంచి టీ20 సిరీస్
రోహిత్ శర్మ (63 నాటౌట్; 56 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సులు), విరాట్ కోహ్లి (33 నాటౌట్; 29 బంతుల్లో 6సిక్సులు) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. రవీంద్ర జడేజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు దక్కింది. భారత్, విండీస్‌లు మూడు టీ20 సిరీస్‌లలో తలపడతాయి. తొలి టీ20 మ్యాచ్ ఆదివారం కోల్‌కతాలో జరుగుతుంది.


Click it and Unblock the Notifications













