For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India New Captain: రోహిత్ శర్మకు మొగుడిలా మారిన హార్దిక్ పాండ్యా.. టీమిండియా కెప్టెన్సీకే ఎసరు!

Team India Captain: Will Hardik Pandya Be Given The Captaincy Over Rohit Sharma After Winning IPL 2022

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ చాంపియన్‌గా నయా టీమ్ గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఏ మాత్రం అంచానల్లేకుండా బరిలోకి దిగిన గుజరాత్.. అసాధారణ ప్రదర్శనతో లీగ్ టాపర్‌గా నిలిచి నాకౌట్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ టైటిల్‌ను చేజిక్కించుకుంది. దాంతో అరంగేట్ర సీజన్‌‌లోనే టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గుజరాత్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర.

'విజయం అయితే మీది... ఓటమి ఎదురైతే అది నాది'.. గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా తన సహచరులతో చెప్పిన మాట ఇది. హార్దిక్‌ పాండ్యాకు ఐపీఎల్‌ టైటిల్స్‌ కొత్త కాదు. ఆటగాడిగా ముంబై ఇండియన్స్‌ తరఫున అతని ముద్ర ఎంతో ప్రత్యేకం. కానీ నాయకుడిగా మాత్రం ఇదే మొదటి అవకాశం. ఏ స్థాయి క్రికెట్‌లోనూ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. దాంతో అతను జట్టు ఎలా నడిపిస్తాడోననే సందేహం వ్యక్తమైంది.

క్లిష్టపరిస్థితుల్లో..

క్లిష్టపరిస్థితుల్లో..

పైగా గత రెండేళ్లుగా వరుస గాయాలతో బాధపడుతూ హార్దిక్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండటంతో పాటు భారత జట్టులోకి కూడా వస్తూ, పోతూ ఉన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తర్వాత మళ్లీ క్రికెట్‌ మైదానంలో కనిపించలేదు. ఇలాంటి స్థితి నుంచి మొదలు పెట్టి సమర్థ నాయకత్వంతో టైటాన్స్‌కు వరుస విజయాలు అందించడమే కాకుండా ఏకంగా టైటిలే అందించాడు. ఎంతో మంది స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఐపీఎల్‌ ట్రోఫీని గెలిపించి అతను తన స్థాయిని గొప్పగా ప్రదర్శించాడు. మొత్తం లీగ్‌లో బ్యాటింగ్‌లో 131.26 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు (మొత్తం 8) పడగొట్టి ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ తన సత్తా ఏంటో తెలియజేశాడు.

ప్రశాంతంగా ఉంటూ..

ప్రశాంతంగా ఉంటూ..

అయితే హార్దిక్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎదుటివారు ఏమనుకున్నా తాను చెప్పాలనుకున్నది బల్లగుద్దినట్టు చెప్పే తత్వం హార్దిక్‌ది. అది అతడికి చిన్ననాటి నుంచే వచ్చింది. ముక్కుసూటిగా మాట్లాడి.. యాటిట్యూడ్‌ ప్రదర్శించి పలుసార్లు విమర్శలకూ గురయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలోనూ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసి సీనియర్ ఆటగాళ్ల చేత చివాట్లు తిన్నాడు. కానీ ఆ తర్వాత సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ఆటగాళ్ల సూచనలతో తన వ్యక్తిత్వం మార్చుకొని ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాడు. అదే ఈ మెగా టోర్నీలో అతడికి బాగా కలిసొచ్చింది. ఆటగాళ్లు ఏదైనా తప్పు చేస్తే దగ్గరికెళ్లి మాట్లాడటం, నిరంతరం బౌలర్లకు అందుబాటులో ఉంటూ విలువైన సూచనలు చేయడం గుజరాత్‌ విజయానికి కలిసొచ్చింది.

సరైన నిర్ణయాలతో..

సరైన నిర్ణయాలతో..

క్రికెట్‌లో గొప్ప సారథులుగా పేరుతెచ్చుకున్నవాళ్లంతా సమయస్ఫూర్తితో మెలిగిన వారే. కపిల్‌దేవ్‌ నుంచి ధోనీ దాకా మైదానంలో చురుగ్గా ఉంటూ అప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకున్నవారే. అందుకే వారు విశ్వవిజేతలుగా ఎదిగారు. పాండ్య సైతం ఈ టోర్నీలో చేసింది అదే. వ్యూహరచనల్లో గానీ ఆటగాళ్లను సమర్థంగా వాడుకునే ప్రణాళికల్లో గానీ అతను వేసిన ప్రతీ అడుగు సత్ఫలితాలనిచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా కెప్టెన్సీ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడైనా సారథి ముందుండి నడిపిస్తే ఆ జట్టుకు లభించే ఆత్మవిశ్వాసమే వేరు. ఈ సీజన్‌లో పాండ్య చేసింది కూడా అదే. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు బౌలర్‌గా గుజరాత్‌కు అవసరమైన సేవలు అందించాడు.

రోహిత్ కెప్టెన్సీకి ఎసరు..

రోహిత్ కెప్టెన్సీకి ఎసరు..

హార్దిక్ కెప్టెన్సీ ప్రభావం ఎంతలా ఉందంటే.. ఇన్నాళ్లు అతన్ని భారత జట్టులో ఉంచేందుకు కూడా ఇష్టపడని వారంత కెప్టెన్ చేయాలని డిమాండ్ చేసేంత. రోహిత్ శర్మ వారసుడిగా కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పేర్లు వినిపించగా.. ఇప్పుడు వారి కంటే ఎక్కువగా హార్దిక్ పేరు వినిపిస్తోంది. కపిల్ దేవ్‌లా జట్టుకు టైటిల్ అందించే సత్తా హార్దిక్‌కు ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వయసు నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ భారత పగ్గాలను అందుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. విరాట్ కోహ్లీ మాదిరి రోహిత్ సైతం తన సారథ్య బాధ్యతలను వదులుకోవాల్సి వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, May 30, 2022, 17:32 [IST]
Other articles published on May 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+