Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా సెలెబ్రిటీల రారాజు విరాట్ కోహ్లీనే.. కరోనా సంక్షోభంలోనూ తరగని బ్రాండ్ వాల్యూ!

 Team India captain Virat Kohli is Indias most valued celebrity
#ViratKohli Is India’s Most Valued Celebrity Brand

న్యూఢిల్లీ: కరోనా కారణంగా గతేడాది యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ మాత్రం చెక్క చెదరలేదు. ఇండియా మోస్ట్ వాల్యూబుల్ సెలెబ్రిటీ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకొని రారాజుగా నిలిచాడు. 2020కి సంబంధించిన అత్యంత విలువైన ప్రముఖుల జాబితాను డఫ్​ అండ్​ ఫెల్ప్స్​ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో రూ.1733 కోట్లతో భారత కెప్టెన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్​ హీరోలు అక్షయ్​ కుమార్​, రణ్​వీర్​ సింగ్​‌లు ఉన్నారు.

ప్రముఖుల బ్రాండ్​ వ్యాల్యూయేషన్ 6వ ఎడిషన్​ ప్రకారం.. విరాట్ తర్వాత రూ. 866 కోట్ల బ్రాండ్​ విలువతో (గతేడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి. బాలీవుడ్​ సూపర్​స్టార్​ అక్షయ్​ కుమార్​, రణ్​వీర్​ సింగ్​ రూ.750 కోట్ల బ్రాండ్​ విలువను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగో స్థానంలో బాలీవుడ్​ బాద్షా.. రూ.372.5 కోట్ల బ్రాండ్​ వాల్యూతో ఉన్నాడు. కరోనా సంక్షోభంలోనూ కోహ్లీ బ్రాండ్​ విలువ అదే విధంగా ఉన్నా.. గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలోని టాప్​-20 సెలబ్రిటీలు వారి విలువలో 5 శాతాన్ని కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలోని టాప్​-10 స్థానాల్లో 9 మంది సినీప్రముఖులు ఉండగా.. ఒక్క స్థానంలో క్రికెటర్​ కోహ్లీ ఉండటం విశేషం. ఆ తొమ్మిది మంది సినీ సెలబ్రిటీల్లో ఇద్దరు కథానాయికలు దీపికా పదుకొణె (రూ. 367.5 కోట్లు), అలియా భట్ (రూ. 350 కోట్లు) ఉన్నారు.

టాప్-10 మోస్ట్ వాల్యూబుల్ సెలెబ్రిటీ లిస్ట్

1. విరాట్​ కోహ్లీ (రూ. 1733 కోట్లు)
2. అక్షయ్​ కుమార్ (రూ. 866 కోట్లు)
3. రణ్​వీర్​ సింగ్(రూ. 750 కోట్లు)
4. షారుక్​ ఖాన్​ (రూ. 372.5 కోట్లు)
5 దీపికా పదుకొణె (రూ. 367.5 కోట్లు) 2019లో మూడోస్థానం.
6. అలియా భట్ (రూ. 350 కోట్లు) 2019లో ఏడోస్థానం.
7. ఆయుష్మాన్​ ఖురానా (రూ. 350 కోట్లు) 2019లో జాబితాతోపోలిస్తే నాలుగు స్థానాలుమెరుగయ్యారు.
8. సల్మాన్​ ఖాన్​(రూ. 328 కోట్లు)
9. అమితాబ్​ బచ్చన్ (రూ. 322.3 కోట్లు)
10. హృతిక్​ రోషన్ (రూ. 287.3 కోట్లు)

Story first published: Thursday, February 4, 2021, 17:03 [IST]
Other articles published on Feb 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+