Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీరకట్టులో మెరిసిన టీమిండియా కెప్టెన్.. పెళ్లి చూపుల కోసమేనా..?

న్యూఢిల్లీ: టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లి చేసుకోబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆమె వివాహ జీవితంలోకి అడుగుపెట్టనుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒక్కటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎప్పుడూ టీమిండియా జెర్సీలో కనిపించే హర్మన్‌ప్రీత్ కౌర్.. తాజాగా భారతీయ సంప్రదాయ దుస్తులైన చీర కట్టులో మెరిసింది. చీర కట్టులో హర్మన్‌ప్రీత్ చూసిన అభిమానులు అవాక్కయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌరేనా? అంటూ సందేహపడ్డారు. తన చీర కట్టు ఫొటోను హర్మన్‌ప్రీత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

Team India Captain Harmanpreet Kaur in the Indian tradition Saree pic goes viral

ఈ ఫొటోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఈ ఫొటోలో హర్మన్‌ప్రీత్ మళయాళ అమ్మాయిలా ఉందని కొందరంటే.. తెలుగు అమ్మాయిల ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లి చూపుల కోసమే చీర కట్టిందని, త్వరలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెడుతుందని అభిప్రాయపడ్డారు.

హర్మన్‌ ప్రీత్ కౌర్‌నే.. వరుడు ఎవరు మేడమ్? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ చీరకట్టుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.

ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొంది తొలి టైటిల్‌ను ముద్దాడింది. లీగ్ ఆసాంతం అద్భుతంగా రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 10 మ్యాచ్‌లో 40.41 యావరేజ్‌తో 281 పరుగులు చేసింది.

135.10 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన హర్మన్‌ప్రీత్.. మొత్తం మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ముంబై జట్టులో హర్మన్‌ప్రీత్‌కు తోడుగా అమెలియా కేర్, హేలీ మాథ్యూస్ రాణించారు.

Story first published: Thursday, April 6, 2023, 16:16 [IST]
Other articles published on Apr 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+