For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 WC 2021: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. తట్టా బుట్టా సర్దుకోండ్రా అబ్బాయిలు! కోహ్లీసేనపై పేలుతున్న సెటైర్లు!

Team India And Virat Kohli Getting Trolled Brutally After Getting Kicked Out From T20 World Cup 2021
T20 World Cup 2021 : Team India, Kohli Trolled భారత్‌ ఇంటిదారి, పేలుతున్న జోకులు || Oneindia Telugu

హైదరాబాద్: ఎన్నో ఆశలతో ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన భారత జట్టు దారుణంగా విఫలమైంది. ఆరంభంలోనే రెండు కీలక మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. అయితే అఫ్గాన్‌పై ఆశలు పెట్టుకున్న అభిమానులకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. అద్భుత విజయంతో అఫ్గాన్, భారత్‌ను ఇంటిదారి పట్టించింది.

దాంతో నేడు నమీబియాతో భారత్ నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా కోహ్లీసేనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు.

టాటా బై బై..

టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రయాణం ముగిసిందని వీరేంద్ర సెహ్వాగ్ ఫన్నీ మీమ్ షేర్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఫొటోతో పాటు ఆయన ఓ సభలో అన్న టాటా బై బై అనే వ్యాఖ్యలను పంచుకున్నాడు. భారత్ కథ ముగిసిందని, టాటా.. బైబై అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వసీం జాఫర్ సైతం ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేశాడు. ఒక సైకిల్ మీద ఉన్న అఫ్గానిస్థాన్, భారత జట్లను పక్కకు నెట్టేసి న్యూజిలాండ్ సైకిల్ ఎత్తుకెళ్లిపోయిందనే మీమ్‌ను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. న్యూజిలాండ్ ఒక్క దెబ్బతో అఫ్గాన్, భారత జట్లను ఇంటి దారిపట్టించిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

బ్యాగులు సర్దుకోండ్రా అబ్బాయిలు..

ఇక అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో బ్యాగులు సర్దుకోండిరా అబ్బాయిలు అంటూ భారత ఆటగాళ్లను ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. చెత్త ఆటతో పరువు తీసారని, 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్ సెమీస్ చేరకపోవడం ఇదే తొలిసారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సారథ్యంతో భారత్‌కు ఈ గతి పట్టించాడని విమర్శిస్తున్నారు. 2022 ప్రపంచకప్‌లోనైనా కొత్త సారథితో భారత్ మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నారు. 2017 నుంచి టీ20ల్లో జైత్రయాత్ర కొనసాగించిన భారత జట్టు.. అసలైన పోరులో మాత్రం చేతులెత్తేసిందని బాధపడుతున్నారు.

కొరకరాని కొయ్యగా న్యూజిలాండ్..

భారత జట్టుకు న్యూజిలాండ్ టీమ్ కొరకరానికొయ్యాగా మారిందని, ప్రతీ టోర్నీలో అడ్డుగా నిలిచి అభిమానులకు కన్నీళ్లే మిగులుస్తుందని కామెంట్ చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ చిత్తు చేసింది. తాజా టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండా అడ్డుకుంది. దాంతో న్యూజిలాండ్ టీమ్‌తో ఎప్పుడూ భారత్‌కు ఇదే సమస్యని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

సమష్టిగా రాణించి..

అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ సమష్టిగా చెలరేగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సగర్వంగా విలియమ్సన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది.

నజీబుల్లా జడ్రాన్(48 బంతుల్ల 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) మినహా అంతా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/24), ట్రెంట్ బౌల్ట్(3/17) అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మరోసారి కెప్టెన్ కేన్ విలియమ్సన్(42 బంతుల్లో 3 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డేవాన్ కాన్వే(32 బంతుల్లో 4 ఫోర్లతో 36), మార్టిన్ గప్టిల్(23 బంతుల్లో 4 ఫోర్లతో 28) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

Story first published: Monday, November 8, 2021, 10:15 [IST]
Other articles published on Nov 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+