India vs Australia: 60 ఏళ్ల తర్వాత 20 మంది ఆటగాళ్లతో టీమిండియా!

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమిండియాను గాయాల బెడద వేదిస్తోంది. అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభం కాకముందే ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా గాయాలబారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ సిరీస్‌లో ఎన్నడూ లేని విధంగా 20 మంది ఆటగాళ్లని ఆడించింది. ఇలా 1961-62 సీజన్ తర్వాత టీమిండియా ఇంతమందితో ఒక సిరీస్‌లో ఆడటం ఇదే తొలిసారి.

ఆరుగురు అరంగేట్రం..
ఇంతకు ముందు 2014-15 ఆస్ట్రేలియా టూర్‌లో, 2018 ఇంగ్లండ్ పర్యటనలో, 1959 ఇంగ్లండ్ టూర్‌లో అత్యధికంగా 17 మందిని ఆడించింది. మరోవైపు ప్రస్తుత సిరీస్‌లో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా, . రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. దాంతో వీరీ స్థానాల్లో కొత్తగా శార్దుల్ ఠాకుర్, టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. దీంతో ఈ సిరీస్‌లో మొత్తం ఆరుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. తొలి మూడు టెస్టుల్లో శుభ్‌మన్‌గిల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్‌సైనీ అరంగేట్రం చేయగా.. చివరి టెస్ట్‌లో నటరాజన్, సుందర్ సంప్రదాయక ఫార్మాట్‌ను ప్రారంభించారు.

1996లో కూడా..
ఇక 1996 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా టీమిండియా ఆరుగురిని అరంగేట్రం చేయించింది. అందులో సునీల్ జోషి, పహరాస్ మాంబ్రే, వెంకటేశ్ ప్రసాద్, విక్రమ్ రాథోడ్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ ఉన్నారు. వీరిలో ప్రసాద్, ద్రవిడ్, గంగూలీ ఆకట్టుకున్నారు. తర్వాత గంగూలీ, ద్రవిడ్ సుదీర్ఘకాలం భారత జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించడమే కాకుండా కెప్టెన్లుగానూ రాణించారు.

1950 తర్వాత తొలిసారి..
ఇక కీలక నాలుగో టెస్ట్‌లో టీమిండియా 50 టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లు లేకుండా బరిలోకి దిగడం 1950 తర్వాత ఇదే తొలిసారి. జట్టులోని ఐదుగురు బౌలర్లలో ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లు కాగా.. మరో ఇద్దరు రెండు టెస్ట్ మాత్రమే ఆడుతున్నారు. సిరాజ్ ఒక్కడికే మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 82 ఓవర్లలో ఆసీస్ 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ సెంచరీ చేసి ఔటవ్వగా.. క్రీజులో కామెరూన్ గ్రీన్(20), టిమ్ పైన్(23) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications