కొత్త ఏడాది 2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే!
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ టెస్ట్ ఓటమితో ఈ ఏడాది(2024)కి ముగింపు పలికిన టీమిండియా.. సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్ట్‌తో కొత్త ఏడాది(2025)కి స్వాగతం పలకనుంది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.
మూడు టీ20లు, మూడు వన్డేల కోసం ఇంగ్లండ్ భారత పర్యటనకు రానుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ సిరీస్ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ జరగనుంది.

ఐపీఎల్ అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. భారత్ క్వాలిఫై అయితే ఈ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 20 నుంచి ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది భారత్ మొత్తం 17 వన్డేలు.. 11 టెస్ట్‌లు ఆడనుంది.
టీమిండియా 2025 షెడ్యూల్..
జనవరి 3 నుంచి 7: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్(బీజీటీ)
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్
జనవరి 22, తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 22, రెండో టీ20(చెన్నై)
జనవరి 28, మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31, నాలుగో టీ20(పుణె)
ఫిబ్రవరి-, ఐదో టీ20(ముంబై)
ఫిబ్రవరి 6-తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9-రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12-మూడో వన్డే(అహ్మదాబాద్)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్
ఫిబ్రవరి 20- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్(దుబాయ్)
ఫిబ్రవరి 23-భారత్ వర్సెస్ పాకిస్థాన్(దుబాయ్)
మార్చి 2- భారత్ వర్సెస్ న్యూజిలాండ్(దుబాయ్)
సెమీస్, ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌లు..
మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025
ఐదు టెస్ట్‌ల కోసం ఇంగ్లండ్ పర్యటనకు భారత్
జూన్ 20-24, తొలి టెస్ట్(లీడ్స్)
జూన్ 2-6, రెండో టెస్ట్(బర్మింగ్‌హామ్)
జూలై 10-14, మూడో టెస్ట్(లండన్, లార్డ్స్)
జూలై 23-27, నాలుగో టెస్ట్(మాంచెస్టర్)
జూలై 31-ఆగస్ట్ 4: ఐదో టెస్ట్(లండన్, కెన్నింగ్‌స్టన్ ఓవల్)
3వన్డేలు, 3 టీ20ల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా(ఆగస్ట్)
వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్(అక్టోబర్)
ఆసియా కప్(అక్టోబర్-నవంబర్)
3వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా(నవంబర్)
సౌతాఫ్రికాతో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్(డిసెంబర్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications