Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరేళ్ల తర్వాత టేలర్ హాఫ్ సెంచరీ.. అశ్విన్‌ను అధిగమించిన చహల్

Taylor brings up first T20I fifty in six years

ఆక్లాండ్ : భారత్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా కెప్టెన్ విలియమ్సన్(26 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), కొలిన్ మున్రో (42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) వీరవీహారం చేశారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 30) కూడా అదిరే ఆరంభం ఇవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 5 వికెట్లు 203 పరుగులు చేసింది.

అయితే అజేయ హాఫ్ సెంచరీతో మెరిసిన రాస్ టేలర్.. దాదాపు ఆరేళ్ల తర్వాత టీ20ల్లో అర్థశతకం సాధించాడు. 2014లో చిట్టగాంగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులతో చివరిసారిగా హాఫ్ సెంచరీ సాధించాడు. మళ్లీ అర్థ శతకం చేసేందుకు 38 మ్యాచ్‌లు..36 ఇన్నింగ్స్‌లు.. తీసుకున్నాడు. ఈ మధ్యలో 26.96 సగటుతో 701 పరుగులు చేశాడు. ఇందులో 5 సార్లు 40కు పైగా పరుగులు చేయగా.. అత్యధికంగా 48 రన్స్ సాధించాడు.

అశ్విన్‌‌ను ధాటిన చహల్..

టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్‌తో చహల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ వికెట్ పడగొట్టి అశ్విన్‌ను అధిగమించాడు. బుమ్రా 54 వికెట్లతో టాప్‌లో కొనసాగుతండగా.. 53 వికెట్లతో చహల్, 52 వికెట్లతో అశ్విన్ తర్వాతి స్థానంలో ఉన్నారు.

ఇక లక్ష్యఛేదనకు దిగిన భారత్ ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) వికెట్ త్వరగా కోల్పోయినా.. కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చెలరేగుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది.

Story first published: Friday, January 24, 2020, 15:13 [IST]
Other articles published on Jan 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+