Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. 23 ఏళ్ల రికార్డ్ బద్దలు!

బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ బాదిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. తద్వారా 23 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా డార్విన్ వేదికగా జరగుతున్న తొలి టెస్ట్‌లో తంజీద్ హసన్(197 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీ సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.

23 ఏళ్ల రికార్డ్ బద్దలు..

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హసన్ సర్కార్(76) పేరిట ఉన్న రికార్డ్‌ను తంజీద్ హసన్ అధిగమించాడు. 2003లో కెయిర్న్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హసన్ సర్కార్ 76 పరుగులు చేశాడు. గత రెండ దశాబ్దాలుగా ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది.

Tanzid Hasan Creates History Becomes First Bangladesh Batter to Score Test Century in Australia

కెరీర్‌లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న తంజీద్ హసన్.. తన తొలి టెస్ట్ శతకాన్ని ఆసీస్ గడ్డపై అందుకోవడం గమనార్హం. ఓవరాల్‌గా విదేశాల్లో సెంచరీ సాధించిన రెండో బంగ్లా బ్యాటర్‌గా కూడా తంజీద్ హసన్ నిలిచాడు. 2002లో మహ్మదుల్ హసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 137 పరుగులు సాధించాడు.

భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్..

ఈ మ్యాచ్‌‌పై బంగ్లాదేశ్ పట్టు బిగించింది. తంజీద్ హసన్(197 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్లకు 351 పరుగులు చేసింది. నజ్ముల్ హోస్సేన్ షాంటో(126 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో శతకం చేజార్చుకోగా.. ముష్ఫికర్ రహీమ్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), మెహ్‌దీ హసన్ మీరాజ్(73 బంతుల్లో 3 ఫోర్లతో 32 బ్యాటింగ్) పర్వాలేదనిపించారు. హసన్ మహముద్(13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/66), జోష్ హేజిల్ వుడ్(2/66) రెండేసి వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో మరో 50 పరుగుల ఆధిక్యం సాధించి..రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తర్వగా ఆలౌట్ చేస్తే చారిత్రాత్మక విజయం సొంతమవుతుంది.

ఆసీస్ 198 ఆలౌట్..

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహ్ముద్(6/55) ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. టస్కిన్ అహ్మద్(2/55), ఎబాడన్ హోస్సేన్ (2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(109 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 71) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Friday, August 14, 2026, 15:20 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+