AUS vs BAN: శతక్కొట్టిన తంజీద్ హసన్.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్!
ఆస్ట్రేలియా గడ్డపై పసికూన బంగ్లాదేశ్ ఆధిపత్యం కొనసాగుతోంది. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ గడ్డపై తొలి టెస్ట్ ఆడుతున్న బంగ్లాదేశ్ అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా డార్విన్ వేదికగా జరగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. తొలి రోజు బంతితో నిప్పులు చెరిగిన బంగ్లాదేశ్.. రెండో రోజు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
తంజీద్ హసన్(197 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్లకు 351 పరుగులు చేసింది. నజ్ముల్ హోస్సేన్ షాంటో(126 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో శతకం చేజార్చుకోగా.. ముష్ఫికర్ రహీమ్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), మెహ్‌దీ హసన్ మీరాజ్(73 బంతుల్లో 3 ఫోర్లతో 32 బ్యాటింగ్) పర్వాలేదనిపించారు. హసన్ మహముద్(13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/66), జోష్ హేజిల్ వుడ్(2/66) రెండేసి వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో మరో 50 పరుగుల ఆధిక్యం సాధించి..రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తర్వగా ఆలౌట్ చేస్తే ఆ జట్టు చారిత్రాత్మక విజయం దిశగా అడుగులు వేస్తోంది.
తొలి బంగ్లా ప్లేయర్‌గా..
96/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ సాధికారికంగా ఆడింది. మోమినుల్ హక్(49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నా.. నజ్ముల్ హోస్సేన్ షాంటోతో కలిసి తంజీద్ హసన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 102 బంతుల్లో తంజీద్ హసన్.. 74 బంతుల్లో నజ్ముల్ హసన్ షాంటో అర్ధశతకాలు సాధించారు. అదే జోరు కొనసాగించిన ఈ జోడీ ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. 188 బంతుల్లో తంజీద్ హసన్ శతకం సాధించాడు.
టెస్ట్‌ల్లో ఆసీస్ గడ్డపై శతకం సాధించిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్‌గా తంజీద్ హసన్ చరిత్రకెక్కాడు. సెంచరీ అనంతరం అతన్ని లయన్ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 93 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ముష్ఫికర్ రహీమ్‌తో కలిసి శతకం దిశగా సాగిన నజ్ముల్‌ను హేజిల్ వుడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. లిట్టన్ దాస్(0) డకౌట్ కాగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్ మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించాడు.
ఆసీస్ 198 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహ్ముద్(6/55) ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. టస్కిన్ అహ్మద్(2/55), ఎబాడన్ హోస్సేన్ (2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(109 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 71) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

