Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రొమేనియా: టీ20ల్లో 12 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టడంలో తమిళవాసి పాత్ర!

Tamil Nadu-born software professional engineers Romania’s record-breaking T20I win

హైదరాబాద్: టీ20ల్లో 12 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డుని గురువారం రొమేనియన్ జట్టు బద్దలు కొట్టింది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20ల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన మ్యాచ్ ఇదే.

అయితే, గురువారం రొమేనియన్ కప్‌లో భాగంగా ఇల్ఫోవ్ కౌంటీలో మోరా వ్లాసీ క్రికెట్ గ్రౌండ్‌లో టర్కీతో జరిగిన మ్యాచ్‌లో రొమేనియా 173 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రొమేనియా జట్టు విజయంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కీలకపాత్ర పోషించడం విశేషం. అతడి పేరు శివకుమార్ పెరియాల్వార్.

అర్జున అవార్డుపై సంతోషం: 35వ కబడ్డీ ప్లేయర్‌గా అజయ్ ఠాకూర్

రొమేనియా తరుపున తొలి సెంచరీ

రొమేనియా తరుపున తొలి సెంచరీ

అంతేకాదు టీ20ల్లో రొమేనియా తరుపున మొట్టమొదటి సెంచరీ సాధించిన ఆటగాడిగా శివకుమార్ పెరియాల్వార్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ అనంతరం శివకుమార్ మాట్లాడుతూ "నేను చిన్నతనంలోనే అండర్ -15, అండర్ -22, అండర్ -25 టోర్నీల్లో పాల్గొన్నాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నేను 2015లో రొమేనియాకు మారాను. నాకు క్రికెట్ పట్ల మక్కువ ఉండటంతో మళ్ళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. నేను రొమేనియాలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల గురించి తెలుసుకుని క్లజ్ క్రికెట్ క్లబ్‌లో చేరాను" అని అన్నాడు.

15 ఓవర్ల తర్వాత భారీ హిట్టింగ్

15 ఓవర్ల తర్వాత భారీ హిట్టింగ్

"నవ్వుతూ నాకు ఎలాంటి ఐడియా లేదు. 15 ఓవర్ల తర్వాత భారీ స్కోరు సాధించడంతో పాటు రన్ రేట్‌ను పెంచడం కోసం హిట్టింగ్ మొదలుపెట్టాను. నా టీమ్ మేట్స్ మరిన్ని బౌండరీలు బాదేవిధంగా సహకరించారు. జట్టు కోసం ఒక్కటే అనుకున్నా... భారీ స్కోరు సాధించాలని" అని శివకుమార్ చెప్పుకొచ్చాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన శివకుమార్ పెరియాల్వార్ ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ సాధించాడు.

20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసిన రొమేనియా

20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసిన రొమేనియా

శివకుమార్ పెరియాల్వార్ సెంచరీతో రొమేనియా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రొమేనియా ఇన్నింగ్స్ పైనల్ ఓవర్‌లో శివకుమార్ మూడు పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం. అనంతరం 227 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టర్కీ 13 ఓవర్లకే 53 పరుగులు చేసి ఆలౌటైంది. రొమేనియన్ బౌలర్ కాస్మిన్ జవోయి ఒక ఓవర్‌లో నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ని మలుపుతిప్పాడు.

అగ్రస్థానంలో రొమేనియా

అగ్రస్థానంలో రొమేనియా

రెండు విజయాలతో రొమేనియన్ కప్‌లో రొమేనియా జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతకముందు ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో రొమేనియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. రొమేనియా జట్టుకు రమేశ్ సతీషన్ నాయకత్వం వహిస్తున్నాడు. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో రమేశ్ సతీషన్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసి 14 పరుగులిచ్చాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం లక్సెంబర్గ్ జట్టుతో తలపడనుంది. తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శివకుమార్ పెరియాల్వార్ రొమేనియాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

Story first published: Friday, August 30, 2019, 17:57 [IST]
Other articles published on Aug 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+