For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. 25 ఫోర్లు, 15 సిక్సర్లతో వీర విహారం.. తమిళనాడు వరల్డ్ రికార్డు!

Tamil Nadu becomes the first List A team in history to score 500 runs

బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు జట్టు సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీలో తమిళనాడు నయా రికార్డు లిఖించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో అసాధారణ బ్యాటింగ్‌తో 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ స్కోర్. గ్రూప్ సీలో భాగంగా బెంగళూరు వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 506 పరుగుల భారీ స్కోర్ చేసింది.

చెలరేగిన ఎన్ జగదీషన్

ఆ జట్టు ఓపెనర్లు నారయణ్ జగదీషన్(141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277) డబుల్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్(102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154) సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ అసాధారణ బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 416 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. బాబా అపరజిత్(31 నాటౌట్), బాబా ఇంద్రజీత్(31 నాటౌట్) కూడా రాణించడంతో తమిళనాడు 500 పరుగుల మార్క్‌ను అందుకుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే ఇది అత్యధిక స్కోర్ కావడం విశేషం.

అత్యధిక స్కోర్..

ఈ ఇన్నింగ్స్‌తో తమిళనాడు రికార్డుల మోత మోగించింది. లిస్ట్ ఏ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అత్యధిక వ్యక్తిగత స్కోర్, అత్యధిక భాగస్వామ్యం రికార్డులను కూడా తమ పేరిట లిఖించుకుంది. ఏ స్థాయి వన్డే క్రికెట్‌లో అయినా ఇది భారీ స్కోరే. లిస్ట్ ఏ క్రికెట్‌లో తమిళనాడు తాజా ఇన్నింగ్స్ 506/2 టాప్‌లో ఉండగా.. ఇంగ్లండ్ 498/6, సర్రే 496/6, ఇంగ్లండ్ 481/4 స్కోర్లు తర్వాతి స్థానంలో ఉన్నాయి.

ఐదో సెంచరీ..

ఐదో సెంచరీ..

141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులతో వీరవిహారం చేసిన నారయణ్ జగదీషన్.. విజయ్ హజారే ట్రోఫీ 2022లో వరుసగా ఐదో సెంచరీ అందుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన బ్యాటర్‌గా.. అత్యధిక భాగస్వామ్యం(416) నెలకొల్పిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఎన్ జగదీషన్‌ను ఆ జట్టు రిటెన్షన్ ప్రక్రియలో వదులుకుంది. అతని నిలకైన ప్రదర్శన చూసిన తర్వాత ఆ జట్టు అభిమానులంతా అనవసరంగా వదులకున్నామని బాధపడుతున్నారు.

రోహిత్ రికార్డు బద్దలు..

రోహిత్ రికార్డు బద్దలు..

ఇక ఏ స్థాయి వన్డే క్రికెట్‌లోనైనా జగదీషన్(277) వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్. ఎమ్ బ్రౌన్ 268 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 264 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన జగదీషన్ తొలి మ్యాచ్‌లో 5 పరుగులు మినహా ప్రతీ మ్యాచ్‌లో 144 నాటౌట్, 107, 168, 128, 277 సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Monday, November 21, 2022, 14:43 [IST]
Other articles published on Nov 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+