అఫ్గాన్ క్రికెట్ టీమ్‌కు తాలిబన్ల మద్దతు.. టీ20 ప్రపంచకప్‌కు లైన్ క్లియర్!

కాబుల్: అఫ్గానిస్థాన్.. ఇప్పుడు ఈ పేరు చెబితే చాలు తాలిబన్ల ఆకృత్యాలు, వారి నరమేధం అందరి కళ్ల ముందు కదలాడుతోంది. తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఈ క్రమంలో ఆ దేశ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తాలిబన్ల ఆక్రమణతో చాలా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అందులో క్రీడారంగం కూడా ఉంది.
దాంతో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ క్రికెట్ జట్టు ఆడుతుందా? లేదా? అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వరుస ట్వీట్లతో తమ దేశ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశాడు. తమ దేశంలో శాంతి ప్రసాదించాలని ప్రపంచ దేశాలకు విన్నవిస్తున్నాడు. ఈ క్రమంలోనే అఫ్గాన్ క్రికెట్ పరిస్థితి ఏందా?అనే ఆందోళన అందరిలో నెలకొంది.
కానీ తాలిబన్లు అనూహ్యంగా క్రికెట్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టు పాల్గొనేది స్పష్టమైంది. అఫ్గానిస్థాన్ క్రికెట్ వర్గాలతో సమావేశమైన తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ.. వారికి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, క్రికెట్ బోర్డు మాజీ అధికారులు నూర్ అలీ జద్రాన్, అసదుల్లా పాల్గొన్నారు. ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ధైర్యంగా క్రికెట్ ఆడండి అని వాళ్లు చెప్పినట్లు సమాచారం.
మరోవైపు అఫ్గాన్ ఆటగాళ్ల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హక్కాని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 1996-2001 మధ్యలో హక్కాని అధ్యక్షతనే అఫ్గాన్‌లో క్రికెట్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి.
త్వరలో ఆ దేశంలో పర్యటించాల్సి ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనలో భద్రతా సమస్యను లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications