Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్ ఆఫ్ ది సెంచరీ.. ఇదెక్కడి స్పిన్ రా అయ్యా! (వీడియో)

కేసీసీ టీ20 ఛాలెంజర్స్ కప్ 2024‌లో భాగంగా కువైట్ నేషనల్స్, ఎస్‌బీఎస్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బంతి టర్న్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కువైట్ ప్లేయర్ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ యాక్షన్‌ను తలపిస్తూ ఫ్లైటెడ్ డెలివరీ వేశాడు. ఈ బంతిని వికెట్ల మీదుగా ఆడేందుకు బ్యాటర్‌ ప్రయత్నించగా.. ఊహించని విధంగా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది.

షాట్ ఆడే లోపే బంతి వికెట్లను తాకడంతో బ్యాటర్ బియాంత్ బిత్తరపోయాడు. ఇదెక్కడి టర్న్ రా అయ్యా అంటూ మైదానం వీడాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు బాల్ ఆఫ్ ది సెంచరీ అంటూ కొనియాడుతున్నారు.

Tabraiz Shamsi reacts to viral ‘ball of century’ video

స్టార్ ఆటగాళ్లు సైతం ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. సౌతాఫ్రికా స్పిన్నర్ టబ్రైజ్ షంసీ సైతం ఈ వీడియోకు ఫిదా అయ్యాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ..'మేం కూడా ఈ బాల్ వేయడంపై ఫోకస్ పెడుతాం'అని కేశవ్‌ మహరాజ్‌ను ట్యాగ్ చేశాడు.

షంసీ, కేశవ్ మహరాజ్ ఆదివారం ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడారు. షంసీ పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించగా.. మహరాజ్.. డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజయం సాధించి వరుసగా రెండో టైటిల్ సొంతం చేసుకుంది.

Story first published: Monday, February 12, 2024, 20:45 [IST]
Other articles published on Feb 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+