ఐసీసీ అధికారిక ప్రకటన.. యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్! టోర్నీ ప్రారంభం ఎప్పుడంటే?

దుబాయ్: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్ 2021 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ దేశాలకు తరలివెళ్లింది. అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు. మెగా టోర్నీ నిర్వహణ వేదిక, తేదీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ప్రపంచకప్ మొత్తం జరుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది.

నాలుగు వేదికల్లో
టీ20 ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లు మొత్తం నాలుగు వేదికల్లో జరగనున్నాయి. యూఏఈ, ఒమన్ దేశాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. టోర్నమెంట్ తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్‌లు.. సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయి.

ప్రిలిమనరీ స్టేజిల్లో
ప్రిలిమనరీ స్టేజిల్లో పోటీపడే దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్‌ల్యాండ్, నమీబియా, ఒమన్, పప్వా న్యూ గునియాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ను సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడమే తమ ఉద్దేశమని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలర్‌డైస్ తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే పొట్టి కప్‌కు ముందు నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. అక్టోబర్ 10-15 మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ అనంతరం పిచ్‌లు సిద్ధం చేసేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రణాళికలు రచించింది.
అభిమానులకు శుభవార్త.. స్టేడియంలోకి 80% మందికి అనుమతి!!

చాలా రోజులుగా అనుకుంటున్నదే
టీ20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. వేదికలో మార్పు చాలా రోజులుగా అనుకుంటున్నదే. కానీ గంగూలీ సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు. 'టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించవచ్చని ఐసీసీకి చెప్పాం. టోర్నీతో ప్రమేయం ఉన్న అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని దాదా చెప్పాడు. గంగూలీ చెప్పిన మరుసటి రోజే ఐసీసీ కూడా అధికారిక ప్రకటన చేసింది. టోర్నీ జరిగేది యూఏఈలోనే అయినా ఆతిథ్యమిచ్చేది మాత్రం బీసీసీఐనే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications