రింకూ సింగ్ సెలెక్షన్ వెనుక రాజకీయ ఒత్తిడి.. శుభ్‌మన్ గిల్ బలి!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుభ్‌మన్ గిల్‌ను తప్పించడాన్ని కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. అయితే రింకూ సింగ్ కోసం శుభ్‌మన్ గిల్‌ను బలి పశువు చేశారనే వాదన వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడితోనే రింకూ సింగ్‌ను భారత ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో రింకూ సింగ్‌ను ఫినిషర్‌గా ఎంపిక చేశారు. అయితే జట్టు ఎంపికలో రింకూ సింగ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని, రాజకీయ ఒత్తిడితోనే చివరి నిమిషంలో ఎంపిక చేశారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్ కోసం శుభ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టారని ఆరోపిస్తున్నారు.

రింకూ సింగ్ కాబోయే సతీమణి, సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ చక్రం తిప్పిందని, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ద్వారా సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శుక్లాతో సమాజ్‌వాదీ పార్టీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. రింకూ సింగ్‌ను ఫినిషర్‌గా ఎంపిక చేయడంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన జితీష్ శర్మను పక్కనపెట్టారు. బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కోసం ఇషాన్ కిషన్‌ను తీసుకొచ్చారు. దాంతో ఓపెనర్ అయిన శుభ్‌మన్ గిల్‌ను తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజకీయ కారణాలను పక్కనపెడితే.. గణంకాలు మాత్రం రింకూ సింగ్ ఎంపిక సరైనదేననే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. రింకూ సింగ్ 35 టీ20ల్లో 42.30 సగటు, 161.76 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ 36 మ్యాచ్‌ల్లో 28.03 సగటు, 138.59 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు. ఈ గణంకాలే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడేలా చేశాయని అభిప్రాయం కలుగుతోంది. కానీ రాజకీయ జోక్యంతోనే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడిందనే వాదన తీవ్ర చర్చనీయంశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications