Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup:'స్టోక్స్, నేను లేకున్నా..ఇంగ్లండ్​ అంటే భయపడాల్సిందే!మ్యాచ్​కు ముందు నిద్ర కూడా పట్టకపోవచ్చు'

T20 World Cup: Jofra Archer feels Opposition teams scared when they have a match against England

లండన్: యూఏఈ, ఒమన్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2021కు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు రోజుల్లో (అక్టోబర్‌ 17) ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. అక్టోబ‌ర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది.

పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. అదేరోజు వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మాజీలు, ప్లేయర్స్ అందరూ తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్ స్పందించాడు.

 గాయం కారణంగా ఆర్చర్ ఔట్

గాయం కారణంగా ఆర్చర్ ఔట్

టీ20 ప్రపంచకప్‌ 2021 ఇంగ్లండ్ జట్టును ఇయాన్ మోర్గాన్ ముందుండి నడిపించనున్నాడు. అందరూ ఊహించిన విధంగానే ఈసీబీ ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. మానసిక సమస్యలతో స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్.. గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్ లాంటి స్టార్లు ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యారు. వీరు మినహా రెగ్యులర్‌గా టీ20ల్లో ఆడే ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఈ ముగ్గరు మెగా టోర్నీకి దూరమయినా.. ఇంగ్లండ్ పటిష్టంగానే ఉంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు ఈసారి కప్ కొడుతుందని అందరూ అంటున్నారు. ఇక తాను, బెన్ స్టోక్స్ లేకున్నా.. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ప్రతిష్టంగానే ఉందని ఆర్చర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్​ అంటే అన్ని జట్లు భయపడాల్సిందే అని, మ్యాచ్​కు ముందు కొన్ని జట్లకు నిద్ర కూడా పట్టకపోవచ్చన్నాడు.

నిద్ర కూడా పట్టకపోవచ్చు

నిద్ర కూడా పట్టకపోవచ్చు

'గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ బాగా రాణిస్తోంది. జట్టుగా మేము విజయవంతంగా కొనసాగుతున్నాం. అందుకే ర్యాంకింగ్స్​లోనూ టాప్​ పొజిషన్స్​లో ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్​ గమనాన్నే మార్చే సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టు​లో ఉన్నారు. నేను, బెన్ ​స్టోక్స్​ టీ20 ప్రపంచకప్ జట్టు​లో ఆడడం లేదు. కానీ జట్టు ప్రదర్శనపై నాకు ఎలాంటి ఆందోళన లేదు.

మేము జట్టులో లేకపోయినా.. ఇంగ్లండ్ పటిష్టంగానే ఉంది. మా స్థానాలను భర్తీ చేసేందుకు ఎంతోమంది యువ క్రికెటర్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్​లో మా జట్టు​తో ఆడేందుకు ఇతర జట్లు భయపడే స్థితి వస్తుందని భావిస్తున్నా. మాతో మ్యాచ్​కు ముందు కొన్ని జట్లకు నిద్ర కూడా పట్టకపోవచ్చు' అని డైలీ మెయిల్ కాలమ్‌లో జోఫ్రా ఆర్చర్ పేర్కొన్నాడు.

IPL 2021: కెప్టెన్ సంగతి తెలియదు కానీ.. కోల్‌కతా అతడిని మాత్రం రిటైన్‌ చేసుకుంటుంది: సెహ్వాగ్

స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకున్నా

స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకున్నా

ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టోలతో బ్యాటింగ్ విభాగం.. క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మొయిన్ అలీ, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్‌లు కూడా ఇంగ్లండ్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోయినా.. ఆ ప్రభావం ఇంగ్లీష్ జట్టుపై ఎక్కడా పడే అవకాశం లేదు.

ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు

ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

రిజర్వ్‌ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్.

Story first published: Friday, October 15, 2021, 9:57 [IST]
Other articles published on Oct 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+